బీట్‌రూట్- క్యారెట్ జ్యూసులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.
క్యారెట్, బీట్‌రూట్‌లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
క్యారెట్, బీట్‌రూట్‌లలో ఫైబర్ ఉంటుంది. వీటి జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పొటాషియం అధికంగా ఉండే బీట్‌రూట్- క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగడం ద్వారా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
బీట్‌రూట్, క్యారెట్‌లలో కేలరీలు చాలా తక్కువ. కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్యారెట్, బీట్‌రూట్‌లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.