Beauty Tips: నిత్యం యవ్వనంగా కనిపించాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి
Beauty Tips:ప్రతీ ఒక్కరూ యుక్త వయస్సుకు రాగానే అందంగా కనిపించాలని అనుకుంటారు. కాని, అదే సమయంలో ముఖంలో వృద్దాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే. సమస్యలకు చెక్ పెట్టి.. నిత్యం యవ్వనంగా కనిపించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటీ? ఈ జ్యూస్ లు తాగితే యవ్వనంగా కనిపిస్తాం.

యవ్వనంగా ఉండటానికి చిట్కాలు :
ప్రతి ఒక్కరూ యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. వృద్ధాప్య ఛాయలను నివారించడానికి చాలా మార్గాలను అన్వేషిస్తారు. చర్మాన్ని అందంగా మార్చే కొన్ని పానీయాల గురించి చూద్దాం. ఈ ఐదు పానీయాలను క్రమం తప్పకుండా తాగితే ఎంత వయసైనా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా, ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండవచ్చు. వృద్ధాప్యంలో వచ్చే మార్పులను తగ్గించి, యవ్వనాన్ని కాపాడుకోవడానికి ఈ పానీయాలు సహాయపడతాయి.
బీట్ రూట్ జ్యూస్ :
బీట్ రూట్ జ్యూస్ సహజంగానే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఇనుము, నైట్రేట్లు ఉన్నాయి. ఇవి చర్మానికి అందాన్నిస్తాయి. బీట్రూట్ జ్యూస్ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వల్ల చర్మ కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
బీట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు:
బీట్ రూట్ చర్మాన్ని మసకబారేలా చేసే విష పదార్థాలను బయటకు పంపుతుంది. చర్మానికి అవసరమైన కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మానికి లోపలి నుండి కాంతినిస్తుంది. రోజుకు 100 నుండి 150 మి.లీ. వరకు తాగవచ్చు. రుచి కోసం క్యారెట్ లేదా ఆపిల్ జ్యూస్‌తో కలిపి తాగవచ్చు.
కొల్లాజెన్ నీరు :
కొల్లాజెన్ చర్మాన్ని ముడతలు లేకుండా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడే ప్రోటీన్. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. కొల్లాజెన్ సప్లిమెంట్స్ లేదా కొల్లాజెన్ కలిపిన పానీయాలు తాగడం మంచిది.
గ్రీన్ టీ ప్రయోజనాలు:
గ్రీన్ టీ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచి, చెడుకొవ్వు కరగడానికి సహాయపడుతుంది. ఇందులోని పాలీఫెనాల్స్ కొల్లాజెన్ చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. చక్కెర కలుపుకోవడం బదులుగా నిమ్మరసం కలుపుకోండి.