Anemia : రక్తం తక్కువగా ఉందా? వీటిని వారం రోజులు తింటే చాలు ..
Anemia: ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో రక్తహీనత ఒకటి. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాపదార్థాలను తీసుకోవాలి. ఆ సూపర్ ఫుడ్ ఏంటీ ఓ లూక్కేయండి.

నువ్వులు
నువ్వులను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు నువ్వుల్లో ఉంటాయి. నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు, క్యాల్షియం, ఫ్లేవనాయిడ్లు, కాపర్ ఇతర పోషకాలు వంటి వివిధ ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను అధిగమించడంలో తోడ్పడతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు నువ్వులు, బెల్లం కలిపి లడ్డులుగా చేసుకుని తింటే మంచిది.
బీట్ రూట్
బీట్‌రూట్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానిని రోజూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే చర్మానికి మేలు చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ను ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
దానిమ్మ
దానిమ్మలో కెలోరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ దానిమ్మ తింటే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
నల్ల ద్రాక్ష
నల్ల ద్రాక్షలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. రోజూ రాత్రి నానబెట్టిన నల్ల ద్రాక్షను ఉదయం తింటే రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
ఖర్జూర
ఖర్జూరంలో ఇనుము అధికంగా ఉంటుంది, ఇది రక్తహీనతను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. రక్తహీనత వల్ల కలిగే అలసటను తగ్గించి, శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఖర్జూరంలోని పోషకాలు శరీరానికి శక్తిని అందించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.
అంజీర
అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ 2 అంజీర పండ్లను పాలతో కలిపి స్మూతీలాగా తీసుకోవచ్చు లేదా ఎండు అంజీరను తేనెలో నానబెట్టి తింటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. పురుషులకు అంజీర చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.