Anemia: ఇవి తింటే ఒంట్లో రక్తానికి కొదవే ఉండదు..
Anemia: ఎండుద్రాక్షలు రక్తహీనత (Anemia) సమస్యను తగ్గించడంతో పాటుగా.. శరీరాన్ని కూడా ఫిట్ గా ఉంచుతాయి. మరి దీన్ని ఎలా ఉపయోగించాలంటే..!

ఎండుద్రాక్షల్లో ఉండే పోషకాలు శరీరానికి అనేక వ్యాధులతో పోరాడే శక్తిని అందించి వ్యాధినిరోధక శక్తి (Immunity)ని పెంచుతాయి. ఎండు ద్రాక్ష మంచి హెల్తీ ప్రోటీన్ కూడా. ఎండు ద్రాక్షలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో క్యాలరీలు (Calories) అధికంగా ఉంటాయి. కనుక మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.
అయితే ఈ ఎండు ద్రాక్షలను తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలో రక్తానికి (Blood) ఏ లోటూ ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షల్లో మరియు తేనెలో పోషకాలు (Nutrients) పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాదు ఎన్నో రోగాలు దూరమవుతాయి.
కఫం, జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యల నుంచి బయట పడటానికి ఇవి దివ్య ఔషదంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఉపయోగించండి: ఎండుద్రాక్షల్లో (raisins), తేనె (Honey)లో కాల్షియం, ఐరన్ తో పాటుగా ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని అలాగే తినేయకుండా రాత్రంగా ఒక గ్లాస్ నీటిలో 6 నుంచి 7 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. మరుసటి రోజు ఉాదయం ద్రాక్షలను తేనెలో మిక్స్ చేసి తినేయాలి.
ఈ రెండింటినీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఇవి శరీరంలో రక్తం లోపాన్ని (Anemia) తొలగిస్తాయి. అలాగే అధిక రక్తపోటు (High blood pressure)ను కూడా నియంత్రణలో ఉంచడానికి ఎండుద్రాక్షలు, తేనె ప్రయోజనకరంగా ఉంటాయి. అంటే రక్తపోటు నియంత్రణలో లేని వ్యక్తులు దీనిని తప్పని సరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థ (Digestive system)ను పటిష్టంగా మార్చడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు నొప్పి ఉన్నవాళ్లు కూడా దీనిని తినొచ్చు. ఈ సమస్యను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.
రక్తప్రసరణ (Blood circulation)ను మెరుగుపరచడంతో పాటుగా మీ చర్మానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చర్మ సమస్యలున్న వారు దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఎండు ద్రాక్షలో క్యాల్షియం (Calcium), మైక్రో న్యూట్రీషియన్స్ (Micronutrients) పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన ఎండుద్రాక్షలు ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.
ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్ ఏ, బీటా కెరోటిన్ (Beta carotene) లు కంటి చూపును మెరుగు పరచడానికి సహాయపడతాయి.
నోటి దుర్వాసనను తగ్గిస్తాయి: ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు అధికంగా ఉంటాయి. బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే నోటి దుర్వాసనను (Bad breath) తగ్గించి తాజా శ్వాసను అందిస్తాయి.