Toothache: పంటి నొప్పి వెంటనే తగ్గిపోవాలంటే ఇలా చేయండి!
పంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. పంటినొప్పి వస్తే.. సరిగ్గా తినలేరు. తాగలేరు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పంటినొప్పి అనేక కారణాల వల్ల రావచ్చు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని సులభంగా నివారించవచ్చు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పంటి నొప్పి అనేక కారణాల వల్ల రావచ్చు. ఈ నొప్పి నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా తక్షణమే పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
ఉప్పునీరు
ఉప్పు నీటితో నోరు పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుంది. ఉప్పులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేడి నీటికి కొద్దిగా ఉప్పు వేసి నోరు పుక్కిలించడం మంచిది.
ఐస్ మసాజ్
నోటిలో పంటి నొప్పి ఉన్న భాగంలో ఐస్ రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. దాదాపు 15-20 నిమిషాలు ఉంచి మసాజ్ చేస్తే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకులు:
సాధారణంగా జామ ఆకులు అందరికి అందుబాటులో ఉంటాయి. ఇవి పంటి నొప్పికి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని నమిలితే పంటి నొప్పి తగ్గుతుంది.
పసుపు
నొప్పి ఉన్న పళ్లకు పసుపు నీరు రాస్తే ఉపశమనం లభిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనికి సహాయపడతాయి.
తేనె:
బాక్టీరియా నిరోధక లక్షణాలతో నిండిన తేనెను వేడి నీటితో కలిపి పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుంది.
టీ బ్యాగ్
చల్లని టీ బ్యాగ్ (గ్రీన్ టీ చేయడానికి ఉపయోగించే టీ బ్యాగ్) రాస్తే పంటి నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది.
లవంగం:
పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగాన్ని అక్కడ కొద్దిసేపు నొక్కి ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది.