MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Belly Fat: ఈ 7 ఫాలో అయితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాయం!

Belly Fat: ఈ 7 ఫాలో అయితే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాయం!

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల నచ్చిన డ్రెస్సులు వేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును సులభంగా ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం. ఈ నియమాలు ఫాలో అయితే చాలు.. మీరు సన్నబడటాన్ని ఎవరూ ఆపలేరు.

2 Min read
Author : Kavitha G
Published : May 16 2025, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మద్యం తాగడం మానేయాలి

మద్యపానం అలవాటు ఉంటే దాన్ని ఆపడం మంచిది. మద్యం ఆకలి, ఒత్తిడిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దానివల్ల బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు మద్యం ఇతర సమస్యలకు కూడా కారణం అవుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం మంచిది.

27
కార్బోహైడ్రెట్లు..

కార్బోహైడ్రెట్లు..

కార్బోహైడ్రేట్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. ఒక వేళ మీరు రోజులో ఎలాంటి శారీరక శ్రమ చేయనివారైతే.. కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవడం మంచిది. ఒక వేళ మీరు చురుకైనా వ్యక్తి అయితే.. లేదా శారీరక శ్రమ ఎక్కువ చేసే వారైతే.. కార్బోహైడ్రేట్లను కాస్త ఎక్కువగా తీసుకున్నా.. ఇబ్బంది ఉండదు.

Related Articles

Related image1
Walking During Periods: పీరియడ్స్ టైంలో వాకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
Related image2
Walking: ఒక్క నిమిషం నుంచి గంట వరకు వాకింగ్.. ప్రయోజనాలు ఇవే!
37
సరిపడా నీరు

సరిపడా నీరు

సరిపడా నీరు తాగితే సగం వ్యాధులు రావని చెబుతుంటారు నిపుణులు. నీటికి అంతా ప్రధాన్యం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి నీరు తాగండి. వాకింగ్ చేస్తున్నప్పుడు నీరు తాగడం మంచిది. భోజనానికి ముందు, తర్వాత కూడా నీరు తాగచ్చు. కానీ భోజనం చేస్తున్నప్పుడు నీరు తాగద్దు. సరిపడా నీరు తాగడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. కాబట్టి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

47
ప్రోటీన్ ఫుడ్

ప్రోటీన్ ఫుడ్

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మరీ ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు ప్రోటీన్ ఫుడ్ తినాలని నిపుణులు చెబుతుంటారు. గుడ్లు, పాలు, మాంసం లాంటివి వాటిలో అధిక ప్రోటీన్లు లభిస్తాయి.

57
వ్యాయామం తప్పనిసరి

వ్యాయామం తప్పనిసరి

ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు అధిక బరువు సమస్యను దూరమవుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి అవసరమైన వ్యాయామాలను నిపుణుల సలహాతో ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈజీగా బరువు తగ్గవచ్చు.

67
ఒత్తిడి తగ్గించుకోండి

ఒత్తిడి తగ్గించుకోండి

ఒత్తిడి.. బరువు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం లాంటివి ప్రయత్నించండి.

77
మంచి నిద్ర

మంచి నిద్ర

నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్ గా బరువు పెరుగుతారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. రోజూ ఒకే టైంకి నిద్రపోవడం, ఒకే టైంకి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Recommended image2
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Malaika Arora Fitness: మలైకా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
Walking During Periods: పీరియడ్స్ టైంలో వాకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Walking: ఒక్క నిమిషం నుంచి గంట వరకు వాకింగ్.. ప్రయోజనాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved