Health Tips: ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే.. ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నట్లే!
ఆరోగ్యంగా ఉండడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్నిసార్లు మనం తెలియక చేసే తప్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవడం అస్సలు మంచిది కాదట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Worst Things To Avoid on Empty Stomach
ఖాళీ కడుపుతో కొన్ని పనులు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది అత్యవసర పరిస్థితుల్లో మనకు సహాయపడుతుంది. కానీ ఇది ఎక్కువగా ఉత్పత్తి కావడం మంచిది కాదు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొన్ని పనులు చేయడం వల్ల కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఉదాహరణకు.. ఉదయం లేవగానే డిజిటల్ పరికరాలను చూడటం, ఏదైనా విషయం గురించి బాధపడటం, ఎక్కువగా ఆలోచించడం వంటివి మానుకోవాలి. మీరు ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే అది మరింత పెరుగుతుంది. ఫలితంగా కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అయితే వికారం, తలతిరగడం, చిరాకు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాఫీ
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఉత్సాహంగా అనిపించినా, ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. దానివల్ల కడుపులో ఇబ్బంది తలెత్తుంది. అంతేకాదు గుండెల్లో మంట, వాపు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నొప్పి నివారణ మాత్రలు
ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోవడం మంచిదికాదు. ముఖ్యంగా నొప్పి నివారణ మాత్రలను అస్సలు వేసుకోకూడదు. కొన్ని మాత్రలను ఖాళీ కడుపుతో వేసుకోవడం వల్ల కడుపులో మంట, పుండ్లు, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయట.
లెమెన్ వాటర్
లెమెన్ వాటర్ మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. అయినప్పటికీ.. దీనిలోని ఆమ్లత్వం కారణంగా ఖాళీ కడుపుతో వీటిని తాగకూడదు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగేవారికి కడుపులో సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
మద్యం సేవించడం
మద్యానికి బానిసలైన కొందరు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తారు. ఇది నేరుగా రక్తంలో కలుస్తుంది. కాబట్టి ఖాళీ కడుపుతో మద్యం సేవించడం మంచిది కాదు. దానివల్ల కాలక్రమేణా కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఆకుకూరలు
ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు ఆరోగ్యానికి మంచివే. అయినప్పటికీ వీటిని ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని.. సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి, దానిలోని పోషకాలను గ్రహించడానికి కొవ్వు, కార్బోహైడ్రేట్లతో కలిపి తినాలి. కాబట్టి మొలకెత్తిన ధాన్యాలు, ఆకుకూరలను ఖాళీ కడుపుతో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.