- Home
- Life
- Health
- Hair Care: జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్..! వెంటనే మీ డైట్ ప్లాన్ మార్చేయండి
Hair Care: జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్..! వెంటనే మీ డైట్ ప్లాన్ మార్చేయండి
Hair Care: ప్రతివారి అందంలో జుట్టు ఎంతో కీలకం, అమ్మాయిలు, అబ్బాయిలకు అయినా తమ జుట్టు అంటే ఎంతో ఇష్టం.కానీ, మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా జుట్టు నిర్జీవంగా మారడం, రాలిపోతుంది. ఇలా జట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన మేలైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డు :
గుడ్డులో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. పెద్ద సైజులో గుడ్డులో దాదాపు 10 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటాయి. బయోటిన్‌తో పాటు, విటమిన్ డి, విటమిన్ బి12, ఇనుము వంటి పోషకాలుంటాయి. గుడ్డులోని ప్రోటీన్ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, జుట్టు విరిగిపోకుండా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గుడ్డును మీ ఆహారంలో చేర్చుకోండి.
బాదం :
బాదం పప్పుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన బయోటిన్, ఇతర పోషకాలు ఉంటాయి. ఒక గుప్పెడు (సుమారు 30 గ్రాములు) బాదంలో దాదాపు 5 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. అంతేకాకుండా, బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా-3, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి జుట్టు దెబ్బతినకుండా కాపాడుతాయి. మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జుట్టు రంగును పెంచుతాయి.
పాలకూర
పాలకూరలో బయోటిన్ మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుము, ఫోలేట్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో దాదాపు 2.5 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. ఐరన్ జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్‌ను చేరవేయడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. విటమిన్ ఎ, సి జట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ ఆహారంలో పాలకూరను కూర, పప్పు లేదా సలాడ్‌లలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.
సాల్మన్ చేప
సాల్మన్ చేపలో ఒమేగా-3 కొవ్వుతో పాటు, జుట్టు పెరుగుదలకు సహాయపడే బయోటిన్, విటమిన్ డి వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులోని బయోటిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. విటమిన్ డి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వారానికి రెండుసార్లు సాల్మన్ చేపను ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.
విత్తనాలు, గింజలు
సన్ ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె విత్తనాలు, చియా విత్తనాలు వంటి వివిధ విత్తనాలు, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి గింజల్లో బయోటిన్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, 1/4 కప్పు సన్ ఫ్లవర్ విత్తనాలలో దాదాపు 2.6 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. ఈ విత్తనాలు, గింజల్లోని జింక్, సెలీనియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి జుట్టు పెరుగుదలకు సహయపడుతాయి. ఇవి జుట్టును బలపరచడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి. వీటిని స్నాక్స్‌గా లేదా మీ సలాడ్‌లు, ఇతర ఆహార పదార్థాలలో చేర్చి తినవచ్చు.