Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..! లేదంటే సమస్యలు తప్పవు..
Worst Breakfast Foods: ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే.. తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. తీసుకునే బ్రేక్ ఫాస్ట్ వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించాలి. కానీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. మన ప్రాణాలకు ప్రమాదం. ఇంతకీ ఆ ఫుడ్స్ ?

బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్
బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజంతా మనల్ని చురుగ్గా ఉండాలంటే.. మనం తినే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకుని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే.. మనం తీసుకునే అల్పాహారంలో అధిక కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
1. బ్రెడ్ :
మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తింటుంటారు. బ్రెడ్ టోస్ట్ చేసి లేదా జామ్ రాసుకుని తినడానికి ఇష్టపడతారు. కానీ వైట్ బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. కాబట్టి, దీన్ని రోజూ తింటే.. శరీరంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా వైట్ బ్రెడ్ లో ఎలాంటి పోషకాలు ఉండవు. కేవలం కేలరీలు మాత్రమే ఉంటాయి. దీంతో గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
2. పాల ఉత్పత్తులు :
మనలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలు, జున్ను, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను చేర్చుకుంటున్నారు. దీనిలో వల్ల శరీరంలో సంతృప్త కొవ్వులు పెరిగి, కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా పెంచే ప్రమాదం అవకాశం ఉంటుంది. తద్వారా గుండెపోటు రిస్క్ పెరగవచ్చు. కాబట్టి అలాంటి ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌లో మానుకోవడం మంచిది.
3. పూరి:
చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా పూరి తినడానికి ఇష్టపడుతారు. కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో పూరి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. పూరిని గోధుమ పిండితో తయారు చేస్తున్నా అది నూనెలో వేయిస్తారు. కాబట్టి, అందులో సంతృప్త కొవ్వులు, సోడియం అధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి పూరిని ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది కాదు.
4. బేకరీ ఫుడ్స్ :
బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేసుకునే సమయం లేక పోవడం వల్ల బేకరీ ఫుడ్స్ వంటి స్నాక్స్‌ను ఎంచుకుంటారు, అయితే ఇవి రుచిగా ఉన్నప్పటికీ ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెరుగుతాయి. వీటి వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
5. షుగర్ సెరెల్స్ :
చాలా మంది, ముఖ్యంగా పిల్లలు, యువత షుగర్ సెరెల్స్ ను బ్రేక్‌ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. అయితే వీటిలో అధికంగా ఉండే చక్కెర, ఫుడ్ కలర్స్ శరీరానికి హానికరం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులోని చక్కెర శరీరంలో వాపును కలిగిస్తుంది. దీనివల్ల హృద్రోగాల ప్రమాదం పెరుగుతుంది.