MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Belly Fat: ఈ ఐదు చేస్తే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

Belly Fat: ఈ ఐదు చేస్తే చాలు.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

బెల్లీ ఫ్యాట్.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్సాహంగా ఉండలేరు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. త్వరగా అలిసిపోతుంటారు. అయితే కొన్ని మంచి అలవాట్లతో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jul 07 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పొట్ట కొవ్వు తగ్గించే చిట్కాలు..
Image Credit : stockPhoto

పొట్ట కొవ్వు తగ్గించే చిట్కాలు..

ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని మంచి అలవాట్లతో బరువు తగ్గడమే కాదు.. పొట్టచుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు. 

నాచురల్ డ్రింక్స్..

మనం రోజూ తాగే కొన్ని జ్యూస్‌లు, సోడాలు, టీ, కాఫీ వంటి పానీయాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ చక్కెర శరీరంలో కొవ్వుగా మారి పొట్ట పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి జ్యూస్‌లు తాగాలనుకుంటే ఇంట్లోనే చక్కెర లేకుండా తయారు చేసుకుని తాగడం మంచిది. నిమ్మకాయ, పుదీనా ఆకులు లేదా దోసకాయ ముక్కలను నీటిలో కలిపి డిటాక్స్ వాటర్ లా తాగచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి నాచురల్ డ్రింక్స్ తాగడం ఇంకా మంచిది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మైదాతో చేసిన ఫుడ్స్ వద్దు!
Image Credit : stockPhoto

మైదాతో చేసిన ఫుడ్స్ వద్దు!

మైదాతో చేసిన ఆహారాలు రుచిగా ఉన్నా ఆరోగ్యానికి మంచివి కావు. పరోటా, బన్, బిస్కెట్, కేక్, సమోసా వంటి బేకరీ పదార్థాల్లో మైదా ఎక్కువగా ఉంటుంది. మైదా జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తుంది. శరీరంలో కొవ్వును పెంచుతుంది. కాబట్టి మైదాకు బదులుగా గోధుమ పిండి, రాగులు, కొర్రలు, ఓట్స్ వంటి తృణధాన్యాలు వాడాలి. ఇడ్లీ, దోశ, చపాతీ వంటివి చేసేటప్పుడు తృణధాన్యాల పిండి వాడటం మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు.

35
ఫ్రైడ్ ఫుడ్స్ వద్దు!
Image Credit : stockPhoto

ఫ్రైడ్ ఫుడ్స్ వద్దు!

నూనెలో వేయించిన పదార్థాల్లో కేలరీలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బజ్జీ, బోండా, చిప్స్, వడ, పూరి వంటివి రుచిగా ఉన్నా.. పొట్ట పెరగడానికి కారణమవుతాయి. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోయి పొట్ట పెరుగుతుంది. వీలైనంత వరకు వేపుళ్లు మానేసి ఆవిరి మీద ఉడికించిన, కాల్చిన లేదా తక్కువ నూనెతో వండినవి తినాలి. కూరగాయల సలాడ్, సున్నుండలు, పండ్లు, గింజల వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం మంచిది.

45
ఫాస్ట్ ఫుడ్ వద్దు!
Image Credit : stockPhoto

ఫాస్ట్ ఫుడ్ వద్దు!

ప్యాక్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్‌లలో ఉప్పు, కొవ్వు, రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. పొట్ట పెరగడానికి కూడా ఇవి కారణమవుతాయి. కాబట్టి వీటికి బదులు ఇంట్లో వండిన తాజా, పోషకమైన ఆహారం తినండి. చికెన్, చేప, గుడ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు తినడం మంచిది.  

55
వ్యాయామం చేయడం..
Image Credit : stockPhoto

వ్యాయామం చేయడం..

ప్రతిరోజు 30-45 నిమిషాలు వేగంగా నడవడం వల్ల కూడా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నడక.. కేలరీలు, కొవ్వును కరిగిస్తుంది. లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం, దగ్గర ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
Health Tips for Diabetes: షుగర్ పేషెంట్లు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే సమస్యలు తప్పవు!
Recommended image2
Foods to Avoid with Fish : చేపలతోపాటు వీటిని కలిపి తింటే.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved