- Home
- Life
- Health
- Foods to Avoid with Fish : చేపలతోపాటు వీటిని కలిపి తింటే.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
Foods to Avoid with Fish : చేపలతోపాటు వీటిని కలిపి తింటే.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
చేపలు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. కానీ చేపలు తినేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. చేపలతో పాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తింటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

చేపలను వేటితో కలిపి తినకూడదు?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. చేపల్లో లీన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు తోడ్పడుతాయి.
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కొన్ని ఆహారాలతో కలిపి తింటే జీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి చేపలతో కలిపి తినకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
పాల ఉత్పత్తులు:
నిపుణుల ప్రకారం.. పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను చేపలతో కలిపి తినకూడదు. దానివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయట. ఉబ్బరం, కడుపు నొప్పితో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ పండ్లు:
చేపలు, సిట్రస్ పండ్లు కలిపి తినడం చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆమ్లం, ప్రోటీన్ కలిసి కొత్త సమస్యలు తెస్తాయట.
బీన్స్:
బీన్స్‌లో రాఫినోస్ అనే చక్కెర ఉంటుంది. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తుంది. చేపలతో కలిపి తింటే ఇబ్బందిపడాల్సి వస్తుంది.
పిండి పదార్థాలు:
బంగాళదుంపలు, పాస్తా వంటివి చేపలతో కలిపి తినకూడదు. వీటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
మసాల ఫుడ్:
మసాల ఫుడ్స్ ని చేపలతో కలిపి తింటే రుచి తగ్గుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు:
ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని చేపలతో కలిపి తింటే పోషకాలు తగ్గుతాయి. వేపుళ్లలో ఉండే కొవ్వులు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.