MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Alcohol: స్ట్రాంగ్ బీర్ తాగినా, విస్కీ తాగినా ఒక‌టేనా.? రెండింటిలో సేమ్ ఆల్క‌హాల్ ఉంటుందా.?

Alcohol: స్ట్రాంగ్ బీర్ తాగినా, విస్కీ తాగినా ఒక‌టేనా.? రెండింటిలో సేమ్ ఆల్క‌హాల్ ఉంటుందా.?

Alcohol: స‌హ‌జంగా మిత్రుల మ‌ధ్య త‌ర‌చూ ఒక టాపిక్ వ‌స్తుంటుంది. “స్ట్రాంగ్ బీర్ తాగితే విస్కీ తాగినట్టే?” అంటుంటారు. మ‌రి నిజంగానే స్ట్రాంగ్ బీర్‌లో విస్కీలో ఉన్నంత ఆల్క‌హాల్ ఉంటుందా.? ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 10 2026, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆల్కహాల్ శక్తిని ఎలా కొలుస్తారు?
Image Credit : Gemini AI

ఆల్కహాల్ శక్తిని ఎలా కొలుస్తారు?

ఏ ఆల్క‌హాల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలుసుకోవడానికి ABV (Alcohol By Volume) అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. సాధారణ లైట్ బీర్‌లో సుమారు 5% ఆల్కహాల్ ఉంటుంది. స్ట్రాంగ్ బీర్‌లో ఇది సాధారణంగా 7% నుంచి 9% వరకు ఉంటుంది. ఇక విస్కీ వంటి డిస్టిల్డ్ లో ఆల్కహాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా విస్కీలో 40% లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. అంటే అదే పరిమాణంలో చూస్తే విస్కీలో బీర్‌తో పోలిస్తే చాలా ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది.

25
బాటిల్‌తో పోలిస్తే సర్వింగ్‌లో లెక్క మారుతుంది
Image Credit : Gemini AI

బాటిల్‌తో పోలిస్తే సర్వింగ్‌లో లెక్క మారుతుంది

సాంకేతికంగా చూస్తే ఒక 750 మిల్లీలీటర్ల విస్కీ బాటిల్‌లో, సాధారణ బీర్‌తో పోలిస్తే దాదాపు 16 రెట్లు ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. కానీ మనం తాగే పరిమాణాన్ని చూస్తే లెక్క కొంచెం మారుతుంది. విస్కీ స్టాండర్డ్ పెగ్ (45 ml), బీర్ సుమారు 330 ml బాటిల్. ఈ రెండు సందర్భాల్లో శరీరంలోకి వెళ్లే ఆల్కహాల్ దాదాపు ఒకే స్థాయిలో ఉంటుంది. అంటే ఒక పెగ్ విస్కీ తాగడం, ఒక చిన్న బీర్ తాగడం మధ్య ఆల్కహాల్ పరంగా పెద్ద తేడా ఉండకపోవచ్చు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు
Related image2
Snakes: స‌మ్మ‌ర్‌లో ఇళ్ల‌లోకి పాములు ఎందుకొస్తాయి.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా
35
స్ట్రాంగ్ బీర్ ప్రభావం ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది?
Image Credit : FREEPIK

స్ట్రాంగ్ బీర్ ప్రభావం ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది?

నార్మల్ బీర్, స్ట్రాంగ్ బీర్ మధ్య 3 నుంచి 4 శాతం ఆల్కహాల్ తేడా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ శరీరంపై దాని ప్రభావం మాత్రం గణనీయంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక 500 ml స్ట్రాంగ్ బీర్ క్యాన్‌లో ఆల్కహాల్ స్థాయి 8% ఉంటే, మీరు ఒకేసారి సుమారు 40 ml శుద్ధ ఆల్కహాల్ తీసుకున్నట్టే. ఈ పరిమాణం దాదాపు విస్కీ రెండు పెగ్‌ల‌కు సమానం.

45
బీర్‌లో గ్యాస్ ఉండటం వల్ల
Image Credit : FREEPIK

బీర్‌లో గ్యాస్ ఉండటం వల్ల

బీర్‌లో కార్బోనేషన్ (గ్యాస్) ఉంటుంది. ఇది ఆల్కహాల్‌ను రక్తంలో త్వరగా కలిసేలా చేస్తుంది. దీంతో త్వ‌ర‌గా మ‌త్తు వ‌స్తుంది. ఇంకా ఒక విషయం ఏమిటంటే, చాలామంది బీర్‌ను త్వరగా తాగేస్తారు. పెద్ద పరిమాణంలో ద్రవంతో పాటు ఎక్కువ ఆల్కహాల్ కూడా శరీరంలోకి వెళుతుంది. అందుకే స్ట్రాంగ్ బీర్ తాగిన తర్వాత కొందరికి మ‌త్తు త్వరగా, స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది.

55
ఆరోగ్యంపై ప్రభావం, హ్యాంగోవర్ సమస్య
Image Credit : FREEPIK

ఆరోగ్యంపై ప్రభావం, హ్యాంగోవర్ సమస్య

విస్కీని చాలా మంది నీరు లేదా సోడాతో కలిపి నెమ్మదిగా తాగుతారు. దీంతో లివర్‌కు దాన్ని ప్రాసెస్ చేయడానికి కొంత సమయం దొరుకుతుంది. కానీ బీర్‌ను చాలా వేగంగా తాగడం సాధారణం. స్ట్రాంగ్ బీర్‌లో ఆల్కహాల్ మాత్రమే కాదు, షుగర్‌తో పాటు క్యాల‌రీలు కూడా ఎక్కువగా ఉంటాయి. బీర్ తాగ‌డం వ‌ల్ల పొట్ట రావ‌డానికి ఇదే కార‌ణం. ఇంకా బీర్ తయారీ సమయంలో ఏర్పడే కొన్ని ఉపపదార్థాలు (by-products) హ్యాంగోవర్‌ను మరింత అసౌకర్యంగా మార్చవచ్చు. విస్కీ డిస్టిలేషన్ ప్రక్రియలో తయారవుతుంది కాబట్టి రసాయన పరంగా కొంత శుద్ధంగా ఉంటుంది. అయితే అందులో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆల్క‌హాల్ ఆరోగ్యానికి హానిక‌రం, దీంతో క‌చ్చితంగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: మటన్ కర్రీలో నూనె ఎక్కువైందా? ఈ చిట్కా వాడి చూడండి
Recommended image2
Mutton Cooking Tips: మటన్ త్వరగా, మెత్తగా ఉడకాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
Recommended image3
Cardamom: భోజనం తర్వాత రోజూ యాలకులు తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు
Recommended image2
Snakes: స‌మ్మ‌ర్‌లో ఇళ్ల‌లోకి పాములు ఎందుకొస్తాయి.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved