MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Mutton Cooking Tips: మటన్ త్వరగా, మెత్తగా ఉడకాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Mutton Cooking Tips: మటన్ త్వరగా, మెత్తగా ఉడకాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

సండే వచ్చింది అంటే చాలు.. దాదాపు ప్రతీ ఇంట్లో మటన్ గుమగుమలు రావాల్సిందే. మటన్ వెరైటీస్ ఉండాల్సిందే. అయితే చికెన్ తో పోలిస్తే మటన్ కాస్త లేటుగా ఉడుకుతుంది. కానీ మటన్ కూడా ఫాస్ట్ గా, మెత్తగా ఉడికే ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 07 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మటన్ త్వరగా ఉడికే చిట్కాలు
Image Credit : Youtube

మటన్ త్వరగా ఉడికే చిట్కాలు

వీకెండ్ వచ్చిందంటే చాలు.. మనలో చాలామందికి నాన్‌వెజ్ ఉండాల్సిందే. చికెన్ అయితే 15-20 నిమిషాల్లో ఉడికిపోతుంది. కానీ మటన్ ఉడకడానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్ లో నాలుగైదు విజిల్స్ వచ్చినా మటన్ సరిగా ఉడకదు. ముక్క సరిగా ఉడక్కపోతే కూర టేస్ట్ మొత్తం పాడవుతుంది. మరి అంత ధర పెట్టి కొనుగోలు చేసిన మటన్ ని ఊరికే పాడుచేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే కొన్ని సింపుల్ చిట్కాలతో మటన్ ని త్వరగా ఎలా వండాలో ఇక్కడ చూద్దాం.

25
వేడి నీళ్లతో కడగడం
Image Credit : Home cooking point/Youtube

వేడి నీళ్లతో కడగడం

మటన్ కొనేటప్పుడే అది లేతదా, ముదురుదా అని కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా లేత మాసం కాస్త త్వరగా ఉడుకుతుంది. ముదురు మాంసం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అలాగే అది మేక మాంసమా, గొర్రె మాంసమా అని కూడా నిర్ధారించుకోవాలి. మటన్ ని ఇంటికి తెచ్చాక, రెండు మూడు సార్లు వేడి నీటితో కడగాలి. పొరపాటున కూడా చల్లటి నీళ్లు వాడొద్దు. చల్లటి నీటితో కడిగితే మటన్ ఉడకడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. వేడి నీళ్లు మటన్ ని త్వరగా ఉడికేలా చేస్తాయి. 

Related Articles

Related image1
Terrace Walking: టెర్రస్ పై వాకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Related image2
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!
35
చిన్న చిన్న ముక్కలుగా..
Image Credit : Freepik

చిన్న చిన్న ముక్కలుగా..

వేడి నీటితో కడిగిన తర్వాత, మటన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చేస్తే ముక్కలన్నీ సమానంగా ఉంటాయి. త్వరగా, మెత్తగా ఉడుకుతాయి. మటన్ వండటానికి నార్మల్ కడాయి కంటే కూడా కుక్కర్ వాడటం మంచిది. ప్రెషర్ కుక్కర్ లో మటన్ త్వరగా ఉడుకుతుంది. అయితే హై ఫ్లేమ్ పై కాకుండా, తక్కువ మంట మీద ఉడికిస్తే మటన్ చక్కగా ఉడుకుతుంది.

45
మసాలాలు వేసే విధానం
Image Credit : freepik

మసాలాలు వేసే విధానం

మటన్‌ను ఉడికించేటప్పుడు మొదట్లోనే మసాలాలు వేయొద్దు. సరిపడా ఆయిల్, చిటికెడు పసుపు, కాస్త అల్లం తురుము వేస్తే చాలు. అల్లంలోని కొన్ని గుణాలు మటన్ ని త్వరగా ఉడికేలా చేస్తాయి. మటన్ కాస్త ఉడికిన తర్వాత మసాలాలు కలుపుకోవచ్చు. అలాగే ఉప్పు వేసే విధానం కూడా ఇందులో ముఖ్యమే. ఉప్పును ముక్క సగం ఉడికాక వేస్తే ముక్కలు గట్టిపడకుండా ఉంటాయి.

55
గోరువెచ్చని నీళ్లు
Image Credit : pinterest

గోరువెచ్చని నీళ్లు

మటన్ కూర వండేటప్పుడు మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోయాల్సి ఉంటుంది. కానీ చల్లటి నీళ్లు పోయకూడదు. బదులుగా గోరువెచ్చని నీళ్లు పోయడం మంచిది. దీనివల్ల మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. వేడిగా ఉన్న మటన్‌లో చల్లటి నీళ్లు పోస్తే, ఉడికే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే గ్యాస్ ఆదా కావడంతో పాటు మటన్ త్వరగా, మెత్తగా ఉడుకుతుంది, రుచిగా ఉంటుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cardamom: భోజనం తర్వాత రోజూ యాలకులు తింటే ఏమౌతుంది?
Recommended image2
Set Dosa: హోటల్ స్టైల్ స్పాంజిలాంటి సెట్ దోశ ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Kitchen Hacks: టీలో పంచదార ఎక్కువైందా? ఇలా తీపి తగ్గించండి..
Related Stories
Recommended image1
Terrace Walking: టెర్రస్ పై వాకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Recommended image2
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved