మటన్ కూరలో నూనె ఎక్కువైతే.. దానిని ఈజీగా తీసేయచ్చు. ఈ ట్రిక్ కేవలం మటన్ కూరకు మాత్రమే కాదు.. ఏ కూరలో అయినా వాడొచ్చు.
Image credits: pinterest
Telugu
ఐస్ క్యూబ్ ట్రిక్
మటన్ కూర ఉడికిన తర్వాత నూనె ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే, వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద ఐస్ ముక్కను గరిటెలో పెట్టుకుని, కూర పైభాగంలో ముంచి వెంటనే పైకి తీయండి.
Image credits: pinterest
Telugu
నూనె గడ్డకడుతుంది
కూర పైన తేలుతున్న అదనపు నూనె, కొవ్వు మొత్తం ఐస్ ముక్క చల్లదనానికి వెంటనే గడ్డకట్టి గరిటెకు లేదా ఐస్ ముక్కకు అంటుకుంటుంది.
Image credits: our own
Telugu
ఇలా రిపీట్ చేయండి
కూరలో నూనె మొత్తం పోయే వరకు ఈ ప్రాసెస్‌ను రెండు, మూడు సార్లు రిపీట్ చేయండి. ఇలా నూనెతో పాటు మటన్‌లోని కొవ్వును కూడా తీసేయొచ్చు.
Image credits: Home cooking point/Youtube
Telugu
ఫ్రిజ్ టెక్నిక్
మరో పద్ధతి కూడా ఉంది. వండిన మటన్ కూరను కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా చేయడం వల్ల నూనె, కొవ్వు మొత్తం గడ్డకట్టి పైకి తేలుతుంది. అప్పుడు దాన్ని స్పూన్‌తో సులభంగా తీసేయొచ్చు
Image credits: foodsenter/Youtube
Telugu
వేడివేడిగా సర్వ్ చేయండి
స్పూన్‌తో నూనెను తీసేశాక, మటన్ కూరను మళ్లీ వేడి చేసి, ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి.