MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు

Birth Date: న్యూమ‌రాల‌జీ ప్రకారం మనం పుట్టిన రోజు మన వ్యక్తిత్వం, ఆలోచన విధానం, ప్రవర్తన గురించి చాలా విషయాలు చెబుతుందని నమ్మకం. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టినవారు ఇత‌రుల విష‌యంలో చాలా క‌ఠినంగా ఉంటారు. ఇది కొన్నిసార్లు ఇబ్బందుల‌కు దారి తీస్తుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 08 2026, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
న్యూమ‌రాల‌జీ ఏం చెబుతోంది.?
Image Credit : Gemini AI

న్యూమ‌రాల‌జీ ఏం చెబుతోంది.?

న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం వ్యక్తి జన్మతేదీని కలిపి వచ్చే సంఖ్యను మూలాంకం అంటారు. ఈ సంఖ్య ఆధారంగా వారి స్వభావం, ఆలోచనలు, జీవన విధానం గురించి అంచనాలు వేస్తారు. కొంతమంది వ్యక్తులు ఇతరుల ప్రవర్తనను విశ్లేషించడంలో చురుకుగా ఉంటారు. వారు ఎదుటివారి లోపాలు, బలహీనతలు త్వరగా గుర్తిస్తారు. కానీ అదే అలవాటు కొన్నిసార్లు ఎక్కువగా విమర్శించే స్వభావంగా మారే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మూలాంకం 1, ఎక్కువగా ఆలోచిస్తారు, త్వరగా నిర్ణయం తీసుకుంటారు
Image Credit : Getty

మూలాంకం 1, ఎక్కువగా ఆలోచిస్తారు, త్వరగా నిర్ణయం తీసుకుంటారు

1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలాంకం 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. ఈ మూలాంకం ఉన్నవారు సాధారణంగా ధైర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ పని చేసినా ఫోకస్‌తో చేస్తారు. కానీ వీరికి ఓవర్ థింకింగ్ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇతరుల ప్రవర్తనను ఎక్కువగా విశ్లేషిస్తూ, కొన్నిసార్లు త్వరగా జడ్జ్ చేసే అవకాశం ఉంటుంది.

35
మూలాంకం 4 – కష్టపడి ప‌నిచేస్తారు కానీ
Image Credit : Getty

మూలాంకం 4 – కష్టపడి ప‌నిచేస్తారు కానీ

4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారి మూలాంకం 4. ఈ సంఖ్యకు అధిపతి రాహు. ఈ మూలాంకం ఉన్నవారు సాధారణంగా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరు కొంత రహస్యంగా కనిపిస్తారు. ఇతరుల గురించి అభిప్రాయం ఏర్పరచుకోవడంలో వీరు తొంద‌ర‌ప‌డుతారు. కొన్నిసార్లు పరిచయం లేని వ్యక్తుల గురించి కూడా వెంటనే నిర్ణయం తీసుకుంటారు.

45
మూలాంకం 8 – క్రమశిక్షణ ఎక్కువ, విమర్శ కూడా
Image Credit : our own

మూలాంకం 8 – క్రమశిక్షణ ఎక్కువ, విమర్శ కూడా

8, 17, 26 తేదీల్లో పుట్టినవారి మూలాంకం 8. ఈ సంఖ్యకు అధిపతి శని. ఈ మూలాంకం ఉన్నవారు చాలా క్రమశిక్షణతో జీవిస్తారు. పనిలో సీరియస్‌గా ఉంటారు. ఏ పని జరిగినా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అయితే ఎవరి పని గురించి మాట్లాడినా చాలా నేరుగా, కఠినంగా విమర్శించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా వారి మాటలు కొన్నిసార్లు ఇతరులకు బాధ కలిగించవచ్చు. 

55
సంబంధాలు మెరుగ‌వ్వాలంటే..
Image Credit : pexels

సంబంధాలు మెరుగ‌వ్వాలంటే..

మూలాంకం 1, 4, 8 ఉన్నవారికి విశ్లేషణ చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక మంచి గుణమే. కానీ అదే గుణం ఎక్కువగా విమర్శించే అలవాటుగా మారితే వ్యక్తిగత సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం సహనం, అర్థం చేసుకునే స్వభావం పెంచుకుంటే ఈ వ్యక్తులు తమ జీవితం, సంబంధాలు మరింత మెరుగ్గా చేసుకోవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో
Recommended image2
మంగ‌ళ‌సూత్రం తీయ‌మ‌న్న‌ప్పుడు ఏడ్చేశా, ఆ ఫుడ్ చూసి వాంతి వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved