MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Curd Rice : ఎండాకాలంలో చల్లచల్లని పెరుగన్నం... హోటల్ టేస్ట్ రావాలంటే ఇలా చేయండి..!

Curd Rice : ఎండాకాలంలో చల్లచల్లని పెరుగన్నం... హోటల్ టేస్ట్ రావాలంటే ఇలా చేయండి..!

మనం తినే భోజనంలో 'పెరుగన్నం'కి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎన్ని రకాలు తిన్నా చివర్లో కాస్త పెరుగన్నం తినకపోతే భోజనం పూర్తికాదనేది తెలుగోళ్ల నమ్మకం. కానీ రుచిగా, చల్లగా ఉండే పెరుగన్నం చేయడం చాలామందికి రాదు... ఆ టిప్స్ ఇక్కడున్నాయి చూడండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 27 2026, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోటల్ స్టైల్ పెరుగన్నం రెసిపీ..
Image Credit : our own

హోటల్ స్టైల్ పెరుగన్నం రెసిపీ..

దక్షిణ భారత భోజనంలో పెరుగన్నం (Curd Rice)కి ప్రత్యేక స్థానం ఉంది. స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఆంధ్రా స్టైల్ చికెన్ పలావ్‌లు తిన్నా చివర్లో పెరుగన్నం లేకుండా మీల్ పూర్తికానట్లే. మరీముఖ్యంగా ఎండాకాలంలో కడుపును చల్లగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి పెరుగన్నం కంటే మంచి ఆహారం మరొకటి లేదు.మ

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెరుగన్నం చేసేందుకు కావాల్సిన పదార్థాలు..
Image Credit : gemini ai

పెరుగన్నం చేసేందుకు కావాల్సిన పదార్థాలు..

హోటళ్లలో దొరికే క్రీమీ, రుచికరమైన పెరుగన్నాన్ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో తెలుసా..? ఇక్కడ పూర్తి గైడ్ ఉంది చూడండి. 

కావాల్సిన పదార్థాలు : 

అన్నం: 1 కప్పు (చద్దన్నం కూడా వాడుకోవచ్చు) 

పెరుగు: 1 కప్పు (తాజా పెరుగు అయితే మంచిది) 

నూనె: 1 టేబుల్ స్పూన్ 

ఆవాలు: 1 టేబుల్ స్పూన్ 

కరివేపాకు: 1 రెమ్మ 

వేయించిన పల్లీలు (వేరుశనగ): 2 టేబుల్ స్పూన్లు 

ఉప్పు: రుచికి సరిపడా 

ఎండు మిరపకాయలు: 1 

మిరియాల పొడి: అర చెంచా 

దానిమ్మ గింజలు: 2 టేబుల్ స్పూన్లు 

దోసకాయ తురుము లేదా ముక్కలు: అర కప్పు

Related Articles

Related image1
పెరుగన్నం తింటే ఇన్ని లాభాలున్నాయా?
Related image2
Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం
35
పెరుగన్నం తయారీ విధానం
Image Credit : gemini ai

పెరుగన్నం తయారీ విధానం

స్టెప్ 1 : అన్నం, పెరుగు మిశ్రమం : 

ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో అన్నం తీసుకోండి. అన్నం మెత్తగా ఉంటే పెరుగన్నం రుచిగా ఉంటుంది. దీనికి ఒక కప్పు పెరుగు వేసి బాగా కలపాలి (మెత్తగా చేయాలి). ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి.

45
స్టెప్ 2 : ఘుమఘుమలాడే తాలింపు
Image Credit : Getty

స్టెప్ 2 : ఘుమఘుమలాడే తాలింపు

ఒక చిన్న పాన్ లేదా తాలింపు గిన్నెను స్టవ్ మీద పెట్టి నూనె వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత కరివేపాకు, ఎండు మిరపకాయలు వేయండి. మిరపకాయ రంగు కొద్దిగా మారే వరకు వేయించాలి. ఇది పెరుగన్నానికి అద్భుతమైన సువాసనను ఇస్తుంది.

55
స్టెప్ 3 : రుచిని పెంచే పదార్థాలు కలపాలి
Image Credit : Gemini AI

స్టెప్ 3 : రుచిని పెంచే పదార్థాలు కలపాలి

ఇప్పుడు సిద్ధం చేసుకున్న తాలింపును అన్నం, పెరుగు మిశ్రమంలో వేయండి. దీనితో పాటు వేయించిన పల్లీలు, సన్నగా తరిగిన దోసకాయ, దానిమ్మ గింజలను కలపండి. పల్లీలు పెరుగన్నానికి కరకరలాడే (Crunchy) అనుభూతిని ఇస్తే, దోసకాయ, దానిమ్మ గింజలు కొత్త రుచిని, తాజాదనాన్ని అందిస్తాయి.

అన్నింటినీ ఒకసారి బాగా కలిపితే, నోరూరించే దక్షిణ భారత స్టైల్ పెరుగన్నం సిద్ధం. దీన్ని వెంటనే తినొచ్చు లేదా కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

కొన్ని చిట్కాలు:

పెరుగు ఎక్కువగా పుల్లగా ఉంటే, కొద్దిగా పాలు కలపడం వల్ల రుచి బ్యాలెన్స్ అవుతుంది. అదనపు రుచి కోసం సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీర కూడా వాడుకోవచ్చు. పెరుగన్నంలోకి మామిడికాయ ఆవకాయ లేదా వడియాలు ఉంటే.. ఆ మజాయే వేరు! ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ పెరుగన్నాన్ని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసి భోజనాన్ని ఎంజాయ్ చేయండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
జీవనశైలి
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు
Recommended image2
Ginger Garlic Paste: ఒక్కసారి చేస్తే చాలు.. హోటల్ స్టైల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నెలలపాటు నిల్వ ఉండే టెక్నిక్
Recommended image3
Tomato Storage: ఎన్నిరోజులైనా టమాటాలు తాజాగా ఉండాలంటే ఇది ఉండాలి
Related Stories
Recommended image1
పెరుగన్నం తింటే ఇన్ని లాభాలున్నాయా?
Recommended image2
Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved