MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Food
  • పెరుగన్నం తింటే ఇన్ని లాభాలున్నాయా?

పెరుగన్నం తింటే ఇన్ని లాభాలున్నాయా?

మనలో చాలా మంది పెరుగు అన్నాన్ని  ఎక్కువగా తింటుంటారు. నిజానికి ఇది తేలికపాటి భోజనమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అవును పెరుగన్నంతో ఎన్నో రోగాలు దూరమవుతాయి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 27 2024, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Curd Rice

Curd Rice

తేలికపాటి, ఆరోగ్యంగా ఉండే ఫుడ్ ఏదంటే కిచిడీ అని చాలా మంది చెప్తుంటారు. అయితే ఈ లీస్ట్ లో పెరుగన్నం కూడా ఉంది. పెరుగన్నం కూడా తేలికపాటి భోజనమే. అందులోనూ దీని టేస్ట్ అదిరిపోతుంది. అందుకే పిల్లలతో పాటుగా పెద్దలు కూడా పెరుగన్నాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Curd Rice

Curd Rice

అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం

పెరుగు అన్నాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. నిజానికి పెరుగు అన్నం అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి మనకు సహాయపడుతుంది. అలాగే ఇది మన జీర్ణవ్యవస్థ, ప్రేగులను కూడా రక్షిస్తుంది.

36

గట్ ఆరోగ్యం 

జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పెరుగు అన్నం మంచి ఆప్షన్. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా సంఖ్యను కూడా మెరుగుపరుస్తుంది. ప్రోబయోటిక్స్ కడుపు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. 
 

46
Image: Freepik

Image: Freepik

ఎముకలు, దంతాలకు ప్రయోజనకరం 

పెరుగులో మెండుగా కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది మన ఎముకలు, దంతాలకు చాలా చాలా అవసరం. అందుకే పెరుగు అన్నం తినడం వల్ల మన ఎముకలు, దంతాలు బలపడతాయి. దంతాలు, ఎముకల సమస్యలొచ్చే ప్రమాదం కూడా తప్పుతుంది.
 

56
Curd Rice

Curd Rice

బరువు నిర్వహణ

బరువు పెరగకుండా ఉండాలంటే మీరు పెరుగన్నాన్ని ఖచ్చితంగా తినండి. పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ మీ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అలాగే గట్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇది మీ ఆరోగ్యకరమైన బరువుకు సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోటీన్, కాల్షియం కంటెంట్ మీ ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

66
Curd rice

Curd rice

సమృద్ధిగా పోషకాలు 

అన్నం, పెరుగును కలిపితే రుచికరమైన వంటకం తయారవుతుంది. అంతేకాదు ఈ ఫుడ్ లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే ప్రోటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనిలోని క్యాల్షియం ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. అలాగే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్  మీ శక్తిని పెంచుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved