MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది

Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది

వయస్సుతో పాటు మెదడు పనితీరు తగ్గడం సహజమే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లు ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సూపర్ ఫుడ్స్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Feb 24 2026, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెదడు ఆరోగ్యానికి 10 సూపర్ ఫుడ్స్..
Image Credit : Getty

మెదడు ఆరోగ్యానికి 10 సూపర్ ఫుడ్స్..

వయస్సుతో పాటు మెదడు పనితీరు తగ్గడం సహజమే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లు ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సూపర్ ఫుడ్స్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి తినే ఆహారంలో సూపర్ ఫుడ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు ఆరోగ్యం కేవలం జ్ఞాపకశక్తికే కాదు, మన భావోద్వేగాలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రతకు కూడా కీలకం. వయస్సు పెరిగే కొద్దీ మెదడులో సహజ మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొన్ని ప్రత్యేక ఆహారాలు మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో ఈ 10 సూపర్ ఫుడ్స్ చేర్చితే మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బ్లూబెర్రీస్, ఆకుకూరలు, సాల్మన్ చేప, బీన్స్..
Image Credit : Getty

బ్లూబెర్రీస్, ఆకుకూరలు, సాల్మన్ చేప, బీన్స్..

మొదటగా బ్లూబెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బ్లూబెర్రీస్ మెదడును ఒత్తిడినుంచి రక్షిస్తాయి. వృద్ధాప్యంతో సంబంధం ఉన్న జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఇవి ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

పాలకూర, కాలే, అరుగూలా వంటి ఆకుకూరల్లో ఫోలేట్, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్న సాల్మన్ చేప వల్ల....మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తికి అవసరం. వాపు తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

బీన్స్: మెదడుకు అవసరమైన స్థిరమైన గ్లూకోజ్‌ను అందించే బీన్స్‌లో ఫోలేట్, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

34
డార్క్ చాక్లెట్, కాఫీ, టీ, పసుపు
Image Credit : Getty

డార్క్ చాక్లెట్, కాఫీ, టీ, పసుపు

డార్క్ చాక్లెట్: ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్ మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.

కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న కాఫీ, టీ చురుకుదనం పెంచుతాయి. ముఖ్యంగా టీలో థియనిన్ అనే ఫైటోకెమికల్ కూడా ఉంటుంది, ఇది ఉత్తేజపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కర్కుమిన్ ఉన్న పసుపులో ఉండే శోథ నిరోదక శక్తి వల్ల మెదడు వాపును తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇది ఉపయోగకరం అని పరిశోధనలు సూచిస్తున్నాయి.

44
ఆహారాలు ఒక్కటే పరిష్కారం కాదు, దానికి తగ్గ , వ్యాయామం, నిద్ర ముఖ్యమే
Image Credit : Getty

ఆహారాలు ఒక్కటే పరిష్కారం కాదు, దానికి తగ్గ , వ్యాయామం, నిద్ర ముఖ్యమే

టమోటాలు: లైకోపీన్ సమృద్ధిగా ఉండే టమోటాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వండిన టమోటాల్లో లైకోపీన్ మరింతగా లభిస్తుంది.

విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన పిస్తాపప్పులు మెదడును రక్షించడంలో సహాయపడతాయి. అయితే మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఆహారాలు ఒక్కటే పరిష్కారం కాకపోయినా, సమతుల ఆహారం, వ్యాయామం, సరైన నిద్రతో కలిపి తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఉంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. నిపుణులు సూచించిన ఈ సూపర్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చడం మంచిదని చెబుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Brain : పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి..
Recommended image2
World Brain Day: వయసు పెరిగినా జ్ఞాపకశక్తి తగ్గకూడదంటే చేయాల్సినవి ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved