Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?
food-life Mar 16 2026
Author: ramya Sridhar Image Credits:Asianet News
Telugu
పిండి ఎలా కలపాలంటే..
పూరీకి పిండి కలుపుకునేటప్పుడు గోధుమ పిండిలో ఒకటి రెండు చెంచాల బొప్పాయి రవ్వ, అర చెంచా వేడి నూనె లేదా నెయ్యి, చిటికెడు పంచదార వేసి కలపాలి. రవ్వ మరీ ఎక్కువ వేయకూడదు.
Image credits: getty
Telugu
చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండాలి
పూరీలు ఎక్కువగా నూనె పీల్చుకుని, సరిగా పొంగకపోవడానికి కారణం పిండి జారుగా ఉండటమే. అందుకే పూరీ పిండి చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండాలి.
Image credits: stockphoto
Telugu
15-20 నిమిషాలు పక్కన పెట్టండి
పూరీ పిండిని కలిపిన తర్వాత, కనీసం 15-20 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి. వెంటనే పూరీలు చేయడం మొదలుపెట్టొద్దు.
Image credits: getty
Telugu
పూరీ ఒత్తేటప్పుడు పొడి పిండి వద్దు
పూరీలు ఒత్తేటప్పుడు పొడి పిండి ఎక్కువగా వాడొద్దు. లేదంటే ఆ పిండి నూనెను పాడు చేస్తుంది. పూరీలను మరీ పల్చగా లేదా మరీ మందంగా కాకుండా, మధ్యస్థంగా ఒత్తుకోవాలి.
Image credits: facebook
Telugu
నూనె వేడి సరిగ్గా ఉండాలి
బాణలిలో నూనె బాగా వేడెక్కిన తర్వాతే పూరీ వేయాలి. చిన్న పిండి ముద్ద వేసి చూడండి. అది వేయగానే పైకి తేలితే, నూనె వేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు.
Image credits: facebook
Telugu
గరిటెతో నెమ్మదిగా నొక్కండి
పూరీని నూనెలో వేయగానే, అది పొంగాలంటే గరిటెతో నెమ్మదిగా నొక్కాలి. ఒకవైపు పొంగిన తర్వాత, రెండో వైపుకు తిప్పి మళ్లీ నొక్కాలి.