Set Dosa: హోటల్ స్టైల్ స్పాంజిలాంటి సెట్ దోశ ఎలా చేయాలో తెలుసా?
food-life Mar 06 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
మీకు సెట్ దోశ తినడం ఇష్టమా?
హోటల్ సెట్ దోశ చాలా మెత్తగా.. నోట్లో పెట్టుకుంటేనే కరిగి పోయేలా ఉంటుంది. అలాంటి దోశ ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
Image credits: instagram
Telugu
మినపప్పు కూడా అవసరం లేదు...
మినపప్పు, మెంతులు, అటుకులు వంటివి ఏమీ లేకుండానే.. దూదిలా మెత్తగా ఉండే సెట్ దోశను తయారు చేయొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం.
Image credits: instagram
Telugu
కావాల్సిన పదార్థాలు ఇవే
వండిన అన్నం, పెరుగు, రవ్వ (బొంబాయి రవ్వ), బియ్యం పిండి, కొద్దిగా నీళ్లు.. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టాలి.
Image credits: instagram
Telugu
ఇప్పుడు రుబ్బుకోవాలి
ఏడెనిమిది గంటలు నానిన తర్వాత, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దోశ పిండి రెడీ అయినట్లే.
Image credits: instagram
Telugu
పైన నెయ్యి, కారంపొడి వేస్తే..
ఇప్పుడు పెనంపై దోశ వేసి, దానిపై కొద్దిగా కారంపొడి (చట్నీపొడి), నెయ్యి వేయాలి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.