MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Terrace Walking: టెర్రస్ పై వాకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

Terrace Walking: టెర్రస్ పై వాకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది రోజూ వాకింగ్ చేస్తుంటారు. అయితే సిటీలో ఉండే వాళ్లు ఎక్కువగా ఇంటి టెర్రస్‌పైన వాక్ చేస్తుంటారు. ఇది సౌకర్యంగా అనిపించినప్పటికీ, మోకాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 06 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టెర్రస్ పై వాకింగ్ మంచిదా? కాదా?
Image Credit : Getty

టెర్రస్ పై వాకింగ్ మంచిదా? కాదా?

వాకింగ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే నగరాల్లో నివసించే చాలామంది టెర్రస్‌పై వాకింగ్ చేస్తుంటారు. ఇలా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలు వస్తాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా వయస్సు పెరిగినవారు లేదా ఇప్పటికే కాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం టెర్రస్ పై సరైన విధంగా నడిస్తే పెద్దగా సమస్యలు రావు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇలా నడిస్తే ఇబ్బంది తప్పదు..
Image Credit : Instagram

ఇలా నడిస్తే ఇబ్బంది తప్పదు..

నిపుణుల ప్రకారం నడక శరీరానికి చాలా ప్రయోజనకరమైన వ్యాయామం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువు, రక్తపోటు, మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ టెర్రస్‌పై నడిచేటప్పుడు సాధారణంగా స్థలం చిన్నగా ఉండటంతో మనం ఒకే చోట తిరుగుతూ నడవాల్సి వస్తుంది. దీనివల్ల ఒకే విధమైన మలుపులు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ తరహా కదలికలు మోకాళ్ల సంధులపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువసేపు ఒకే దిశలో తిరుగుతూ నడిస్తే మోకాళ్లలో అసౌకర్యం కలగవచ్చు.

Related Articles

Related image1
Early Wake Up: 10 రోజులపాటు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా?
Related image2
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!
36
ఒత్తిడి పెరిగే అవకాశం..
Image Credit : Getty

ఒత్తిడి పెరిగే అవకాశం..

అలాగే టెర్రస్‌ ఉపరితలం చాలా గట్టిగా ఉంటుంది. ఇలాంటి ఫ్లోర్ పై ఎక్కువసేపు నడిస్తే మోకాళ్లు, మడిమలు, కాళ్ల కండరాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే మోకాళ్ల నొప్పి, వాతం లేదా కాళ్ల బలహీనత ఉన్నవారు గట్టి నేలపై ఎక్కువసేపు వాకింగ్ చేస్తే నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన షూస్ ధరించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

46
ఎక్కువసేపు నడిస్తే..
Image Credit : istockphoto

ఎక్కువసేపు నడిస్తే..

వాకింగ్ చేసే విధానం కూడా ముఖ్యమే. చాలామంది ఒకేసారి ఎక్కువసేపు నడవడానికి ప్రయత్నిస్తారు. శరీరానికి అలవాటు లేకపోయినా ఒక్కసారే ఎక్కువగా నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట్లో తక్కువ సమయం నుంచి ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. ఇలా చేస్తే కాళ్ల కండరాలు ఈ వ్యాయామానికి అలవాటు పడతాయి.

56
దిశలు మార్చడం
Image Credit : Getty

దిశలు మార్చడం

టెర్రస్‌పై వాకింగ్ చేసే వారు ఒకే దిశలో తిరుగుతూ నడవడం కంటే కొంతసేపు ఒక దిశలో, తర్వాత మరో దిశలో నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల మోకాళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా వాకింగ్ ప్రారంభించే ముందు చిన్నగా వార్మప్స్ చేయడం మంచిది. 

66
ఈ జాగ్రత్తలతో..
Image Credit : our own

ఈ జాగ్రత్తలతో..

అధిక బరువు ఉన్నవారికి మోకాళ్లపై సహజంగానే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాంటి వారు వాకింగ్ ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు స్లో వాకింగ్ తో పాటు తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా క్రమంగా మోకాళ్ల బలం పెంచుకోవచ్చు. టెర్రస్‌పై సరైన పద్ధతిలో, సరైన షూస్‌తో, మితంగా నడిస్తే ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Early Wake Up: 10 రోజులపాటు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved