కాకరకాయ కంటే చేదుగా ఉండే పదార్థం ఇదే
Most Bitter Taste: చేదు అనగానే మనకు గుర్తొచ్చేవి కాకరకాయ కదా.. కాని దానికంటే చేదుగా ఉండే ఓ పదార్థాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ భూమ్మీద ఉండే చేదు పదార్థాలన్నింటిలో అత్యంత చేదుగా ఉండే పదార్థం ఇదేనట. మరి ఆ చేదు పదార్థం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా?

ప్రపంచంలో అత్యంత చేదు పదార్థాన్నిఅమరోపోస్టియా స్టిప్టికా అనే ఫంగస్ లో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని సాధారణంగా చేదు బ్రాకెట్ ఫంగస్ అని పిలుస్తారు. ఇందులో ఉండే ఒలిగోపోరిన్ డి అనే సమ్మేళనం ఇప్పటివరకు గుర్తించిన చేదు పదార్థాల్లో అత్యంత చేదు పదార్థమని సైంటిస్టులు, పరిశోధకులు గుర్తించారు. ఇది మనిషి రుచి గ్రాహకాలపై పరిశోధనలు చేయడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇది ఒక మష్రూమ్
శాస్త్రవేత్తలు గుర్తించిన చేదు బ్రాకెట్ ఫంగస్ ఒక మష్రూమ్ రకానికి చెందినది. ఇందులో ఉండే ఒలిగోపోరిన్ డి మిక్చర్ చాలా చేదుగా ఉంటుంది. చేదు బ్రాకెట్ ఫంగస్ చాలా చేదుగా ఉన్నప్పటికీ విషపూరితం కాదు. ఒలిగోపోరిన్ డి ప్రత్యేకంగా మానవులలో TAS2R46 చేదు రుచి గ్రాహకాన్ని యాక్టివేట్ చేస్తుంది.
చేదు పదార్థాలన్నీ మొక్కల్లోనే..
ఇప్పటివరకు గుర్తించిన చేదు పదార్థాలన్నీ మొక్కల నుంచే శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా కూరల్లో కాకరకాయ అత్యంత చేదు అని అనుకుంటాం. కాని దాన్ని మించి కనీసం రుచి కూడా చూడలేనంత చేదుగా ఒలిగోపోరిన్ డి ఉంటుందట. అయితే ఇది జీర్ణక్రియ పెరుగుదలకు సహాయ పడే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
శరీరంలో అనేక భాగాల్లో చేదు గ్రాహకాలు
మీరు తెలుసా? చేదు రుచి గ్రాహకాలు నోటిలో మాత్రమే కాకుండా కడుపు, ప్రేగులు, గుండె, ఊపిరితిత్తులలో కూడా ఉంటాయి. అందువల్లనే చేదు వస్తువు ఒకసారి కడుపులోకి వెళ్తే వెంటే వాంతి వచ్చిన భావన కలుగుతుంది. కొందరైతే వెంటనే వాంతి కూడా చేసేసుకుంటారు.
సైన్టిస్టులు కనిపెట్టిన ఈ పదార్థం భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మానవ శరీరం, జీర్ణక్రియకు సంబంధించి కొత్త విషయాలు కనుకొనడానికి ఈ ఫంగస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..