MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

కారులో ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణం చేయడం కష్టమే కదా.. కాని కారుల్లో కూడా మసాజ్ చేసే సీట్లు ఉంటే చాలా బాగుంటుంది కదా.. లాంగ్ జర్నీలను హాయిగా మార్చడానికి మసాజ్ సీట్లతో కూడిన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల కంపెనీలు, అవి ఇచ్చే ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 24 2025, 12:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు బాగా అలసిపోతారు. అందుకే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మసాజ్ కుర్చీలు ఉంటాయి. ప్రయాణ అలసట తీర్చుకోవడానికి ఈ మసాజ్ కుర్చీలు బాగా ఉపయోగపడతాయి. అందుకే మసాజ్ సీట్లు కలిగిన కొన్ని కార్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఇవి మీ నడుము నొప్పిని తగ్గిస్తాయి. మసాజ్ సీట్లు ప్రధానంగా హై ఎండ్ వాహనాల్లో కనిపిస్తాయి. మాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాల్లో మీరు చూసే మసాజ్ కుర్చీల మాదిరిగానే ఈ కార్లలో సీట్లు పనిచేస్తాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మసాజ్ సీట్ కలిగిన ప్రీమియం కార్లు

ఈ కార్లలో ప్రయాణీకుల సీట్లన్నీ అంతర్నిర్మిత మసాజ్ మెకానిజమ్‌లతో పని చేస్తాయి. ఈ ఫీచర్ కలిగిన కారుల్లో స్కోడా కోడియాక్, వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ వంటి ప్రముఖ మోడల్స్ మార్కెట్ లో అమ్మకాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ రెండు కంపెనీల కార్లు దాదాపు రూ.50 లక్షల ధరలో ఉన్నాయి.

ఒక వేళ మీరు తక్కువ ధరలో మసాజ్ సీట్లున్న కారు కావాలనుకుంటే MG గ్లోస్టర్ తీసుకోండి. దీని ధర రూ.39.57 లక్షలతో ప్రారంభమవుతుంది. హై ఎండ్ ధర రూ.44.74 లక్షల వరకు ఉంటుంది.

35

లగ్జరీ కార్లు

BMW, Mercedes-Benz, Land Rover, Lamborghini వంటి లగ్జరీ కార్ల తయారీదారులు తమ మోడళ్లలో బెస్ట్ ఫీచర్లతో ఉన్న మసాజ్ సీట్లను అందిస్తున్నాయి. లాంగ్ డ్రైవ్, ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రయాణాల సమయంలో డ్రైవర్, ప్రయాణీకులు ఈ మసాజ్ సీట్ల ద్వారా అలసట తగ్గించుకోవచ్చు. 

45

రూ.20 లక్షల లోపు కార్లు

మీ బడ్జెట్‌ రూ.20 లక్షల లోపు అయితే అనేక కార్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లలో సీట్ కుషన్ ద్వారా చల్లటి గాలిని ప్రసరింపజేసే అంతర్నిర్మిత హోల్స్ ఉన్నాయి. అవి అలసటను తగ్గిస్తాయి. దీంతో లాంగ్ డ్రైవ్ మరింత హాయిగా, భద్రంగా చేయవచ్చు.

55

ఈ కార్లలో వెంటిలేషన్‌ కూడా ఉంది..

తక్కువ ధరలో వెంటిలేటెడ్ సీట్లను అందించే కార్లలో టాటా పంచ్ EV, టాటా నెక్సాన్, కియా సోనెట్, కియా కారెన్స్ (సైరస్), మారుతి సుజుకి XL6, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి మోడల్స్ ఉన్నాయి. అవి పూర్తి మసాజ్ ఫంక్షన్‌లను అందించకపోయినా, ఈ వెంటిలేటెడ్ సీట్లు రోజువారీ డ్రైవర్లకు ఉత్తేజకరమైన రిలాక్సింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఇది కూడా చదవండి జస్ట్ రూ.50 వేలు చెల్లించి టొయోటా ఫార్చూనర్ కారుని మీ సొంతం చేసుకోండి!

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
విద్యుత్ వాహనాలు
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image2
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Recommended image3
90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved