Cucumber: కీరదోసను వీళ్లు మాత్రం పొరపాటున కూడా తినకూడదు..!
Cucumber: నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కానీ, కొందరు పొరపాటున కూడా ఈ కూరగాయను తినకూడదు. అసలు, ఈ కీరదోసను చలికాలంలో తినొచ్చా? తింటే ఏమౌతుంది?

చలికాలంలో కీరదోసకాయ....
కీర దోసకాయలో నీరు అధికంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఈ కూరగాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే... చలికాలంలో దీని అవసరం ఏమీ ఉండదులే అని చాలా మంది తినరు. కానీ, చలికాలంలో కూడా దీనిని మితంగా తినడం వల్ల శరీరాన్ని చాలా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ కీరదోసలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే, దీనిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ... ఈ కీరదోసను కొందరు మాత్రం పొరపాటున కూడా తినకూడదు. మరి, ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
గ్యాస్ట్రిక్, అజీర్ణ సమస్యలు ఉన్నవారు...
కీరదోసలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఇప్పటికే గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఈ కీరదోసను తినకుండా ఉండటమే మంచిది. లేకపోతే సమస్యలు ఎక్కువ అవుతాయి.
దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి ఉన్నవారు
కీరదోసకాయ శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఎవరికైనా ఇప్పటికే దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు.. దీనిని తినకపోవడమే మంచిది.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు...
కొంతమందికి కీరదోసకాయలు తిన్న తర్వాత అలెర్జీలు రావచ్చు. ఇది దురద, పెదవులు లేదా గొంతు వాపు, కడుపు నొప్పి వికారం వంటి అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది.
మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు
కీరదోసకాయ ఒక సహజ మూత్రవిసర్జన, అంటే ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన సమస్య ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాదు, కీరదోసకాయ
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా, రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇప్పటికే తక్కువ బిపి సమస్యలు ఉన్నవారు దీనిని తిన్న తర్వాత తల తిరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు.
చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు
కొంతమంది శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను ఇష్టపడరు, ముఖ్యంగా మీకు జలుబు, చేతులు , కాళ్ళు చల్లగా ఉండటం లేదా తరచుగా కడుపు నొప్పులు ఉంటే, కీరదోస తినకపోవడమే మంచిది.

