సొరకాయ నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయ. చాలా పోషకాలు ఉండే ఈ కాయను జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారికి మంచి ఆప్షన్. మరి ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటి?

సొరకాయ జ్యూస్ రోజూ తాగొచ్చా?: 

మనకు రెగ్యులర్ గా లభించే చాలా కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. దీనిని కూరగాయగా తీసుకున్నా..జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ జ్యూస్ ని ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల సులభంగా ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు. కానీ, పొరపాటున ఏదైనా పాడైన సొరకాయ జ్యూస్ కనుక మీరు తాగితే ఆరోగ్యానికి చాలా హానికరం. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా. మరి, సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందామా…

పాడైన సొరకాయ జ్యూస్ ప్రాణాంతకం

పాడైన సొరకాయ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి హానికరం. పాడైన సొరకాయలో విష పదార్థాలు ఉంటాయి, ఇవి కడుపులో మంట, వాంతులు, విరేచనాలు, కడుపులో రక్తస్రావం కూడా కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో, పచ్చి సొరకాయ జ్యూస్ వల్ల శరీరంలో విష ప్రభావం కలిగి, కాలేయం, మూత్రపిండాల మీద ప్రభావం చూపుతుంది.

వాంతులు, విరేచనాలు

కొన్నిసార్లు మనం పాడైన సొరకాయ తెచ్చుకుని, జ్యూస్ చేసుకుని తాగేస్తాం. దీనివల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సి వస్తుంది.

మందులతో కలిస్తే ప్రమాదం

మీరు డయాబెటిస్, బీపీ లేదా లివర్ మందులు వాడుతుంటే, సొరకాయ జ్యూస్ వాటితో కలిసిపోయి, బ్లడ్ షుగర్ చాలా తగ్గిపోతుంది. అందుకే డయాబెటిస్, బీపీ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే సొరకాయ జ్యూస్ తాగాలి.

ఎక్కువగా తాగితే గ్యాస్, అజీర్తి

రోజూ ఎక్కువగా సొరకాయ జ్యూస్ తాగితే, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

జాగ్రత్తలు

సొరకాయ తెచ్చుకున్నప్పుడు, అది పాడైందో లేదో చూసుకోండి. పాడైపోయి ఉంటే జ్యూస్ చేసుకోకండి. రోజుకి 150 ml కన్నా ఎక్కువ జ్యూస్ తాగకండి. జ్యూస్ లో నల్ల ఉప్పు, పుదీనా, నిమ్మరసం కలిపి తాగితే రుచిగా ఉంటుంది. అజీర్తి కూడా ఉండదు.