Pani Puri: పానీపూరికి, మహాభారతానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
చిన్నా, పెద్దా ఇష్టంగా తినేవాటిలో పానీపూరి ఒకటి. పానీపూరి కోసమే సాయంత్రంపూట బయటకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. రుచిగా ఉంటుంది. తక్కువ ధరలో వస్తుంది కాబట్టి చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. మనం ఇంత ఇష్టంగా తినే పానీపూరికి, మహాభారతానికి కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
పానీపూరి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్నా, పెద్దా వీటిని లొట్టలేసుకుంటూ తింటారు. కానీ అసలు పానీ పూరి ఎలా వచ్చింది? దాన్ని మొదటగా ఎవరు తయారుచేశారు? అసలు దాని చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఓసారి తెలుసుకుందాం పదండి.
పాని పూరి
స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది పానీపూరి. తీపి, పులుపు నీళ్లు, బంగాళాదుంప, శనగపిండి మసాలాతో దీన్ని తయారుచేస్తారు. పానీపూరి చరిత్ర శతాబ్దాల నాటిదని చాలామంది నమ్ముతారు.
పాని పూరి, మహాభారకతానికి సంబంధం ఏంటి?
పానీపూరికి మహాభారతానికి సంబంధం ఉందని చాలామంది నమ్మకం. కష్టకాలంలో ద్రౌపది గోల్గప్ప చేసిందని.. అదే నేటి పానీపూరి అని చాలామంది చెబుతుంటారు.
ద్రౌపదిని పరీక్షించిన కుంతి
పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, ద్రౌపది, కుంతి కూడా వారితో ఉన్నారు. కుంతి ద్రౌపదిని పరీక్షించాలనుకుందట. కుంతి.. ద్రౌపదికి బంగాళాదుంపలు, మసాలాలు, పిండి ఇచ్చి, పాండవులకు ఏదైనా కొత్తరకం వంట చేయమని చెప్పిందట. కొన్ని పదార్థాలతో అందరికీ సరిపోయేలా ఎలా తయారుచేయాలని ఆలోచించిన ద్రౌపది పానీపూరి చేసిందట.
పానీపూరి చేసిన ద్రౌపది!
కుంతి ఆజ్ఞ ప్రకారం ద్రౌపది పానీపూరి చేసి పాండవులకు వడ్డించిందట. తర్వాత అన్ని చోట్లా పానీపూరి తయారవడం మొదలైందట. అప్పటినుంచి పానీపూరిని ద్రౌపది వంటకంగా చెబుతుంటారు. కానీ గోల్గప్ప మగధ నుండి వచ్చిందని మరికొన్ని కథలు చెబుతున్నాయి. మగధ అనేది నేటి దక్షిణ బీహార్.