ఈ చట్నీలు రోజూ తిన్నా కూడా బరువు తగ్గొచ్చు.. అవేంటో తెలుసా?
కేవలం ఉడికించిన, పచ్చి కూరగాయల్లో మాత్రమే క్యాలరీలు తక్కువగా ఉంటాయి అని అవి మాత్రమే తింటూ ఉంటారు. కానీ.. రోజూ అలాంటి ఆహారం తినడానికి మనసు రాదు. ఎలాంటి రుచి లేదని.. మళ్లీ నార్మల్ ఫుడ్ తినడం మొదలుపెడతారు.. మళ్లీ బరువు పెరుగుతారు.

chutney
బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది బరువు తగ్గాలి అంటే.. ఉడికించిన కూరగాయలు, రుచి, మసాలాలు లేకుండా వంటలు తినాలి అనే భావన కలిగి ఉంటారు. కేవలం ఉడికించిన, పచ్చి కూరగాయల్లో మాత్రమే క్యాలరీలు తక్కువగా ఉంటాయి అని అవి మాత్రమే తింటూ ఉంటారు. కానీ.. రోజూ అలాంటి ఆహారం తినడానికి మనసు రాదు. ఎలాంటి రుచి లేదని.. మళ్లీ నార్మల్ ఫుడ్ తినడం మొదలుపెడతారు.. మళ్లీ బరువు పెరుగుతారు. కానీ... రెగ్యులర్ గా తినే కొన్ని చట్నీలు తిన్నా కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. క్యాలరీలు తక్కువగా ఉండేలా, ఫైబర్ ఎక్కువగా ఉండేలా ఎలాంటి చట్నీలు ఇంట్లో చేసుకోవచ్చు.. వాటితో బరువు ఎలా తగ్గవచ్చో ఇప్పుడు చూద్దాం....
1.కొత్తిమీర-పుదీనా చట్నీ...
కొత్తమీర, పుదీనా ఈ రెండూ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రెండింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మన శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపించడంలో సహాయపడతాయి. పుదీనా తిన్నప్పుడు ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఎక్కువగా తినకుండా, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు.. ఈ రెండూ ఉపయోగించి ఇంట్లోనే చట్నీ తయారు చేసుకొని హ్యాపీగా తినవచ్చు. వేరుశెనగ చట్నీకి బదులు మీరు దీనిని వాడొచ్చు.
2.టమాటా–వెల్లుల్లి చట్నీ
టమాటాలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి తింటే శరీరంలోని వాపులు తగ్గుతాయి, మెటబాలిజం మెరుగుపడుతుంది. వీటిని కలిపి చేసిన చట్నీ బరువు తగ్గేవారికి ఆరోగ్యకరమైన ఆప్షన్.మీరు ఈ చట్నీని మీ డైట్ లో భాగం చేసుకోవచ్చు.
3.కొబ్బరి–కరివేపాకు చట్నీ
కొబ్బరిలో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా సహాయం చేస్తాయి. కరివేపాకు కూడా మన బాడీలో ఫ్యాట్ ని కరిగించేస్తుంది. కరివేపాకు, మిరపకాయలు, కొబ్బరితో చేసిన చట్నీ రుచికరంగానే కాకుండా ఆరోగ్యకరంగానూ ఉంటుంది.
ఆపిల్–దాల్చిన చెక్క చట్నీ
ఆపిల్‌లో ఎక్కువ ఫైబర్, నీరు ఉంటాయి. ఇది తిన్నప్పుడు కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను కంట్రోల్ లో ఉంచుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. దీని వల్ల బరువు పెరగకుండా నియంత్రించవచ్చు. రుచిలో కొంచెం తీపిగా అనిపించొచ్చు.
ఈ చట్నీలను అధిక నూనె లేదా ఉప్పు వేసి కాకుండా, సహజమైన రీతిలో తయారు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. వీటిని రాగి రొట్టె, సజ్జ రొట్టెలు లేదా మిల్లెట్ భోజనంతో తింటే ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తుంది. అన్నం, కేలరీలు ఎక్కువగా ఉండే దోశలు, పూరీలు కాకుండా.. మిల్లెట్స్,సజ్జలు, జొన్నలతో ఈ చట్నీలు తింటే.. మీ బరువుకు సహాయపడతాయి.