- Home
- Life
- Food
- Costly Non Veg: కిలో మాంసం ధర రూ. 31 లక్షలు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాంసాహారం ఇదే
Costly Non Veg: కిలో మాంసం ధర రూ. 31 లక్షలు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాంసాహారం ఇదే
Costly Non Veg: వెజ్‌తో పోల్చితే నాన్ వెజ్ ధర అధికంగా ఉంటుందని తెలిసిందే. ప్రపంచంలో కొన్ని నాన్‌వెజ్ వంటకాల ధరలు లక్షల్లో ఉన్నాయని మీకు తెలుసా.? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొన్ని నాన్‌వెజ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అల్మాస్ క్యావియర్ (Almas Caviar)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాన్‌వెజ్ ఫుడ్‌గా అల్మాస్ క్యావియర్ గుర్తింపు పొందింది. ఇది ఇరాన్ సమీపంలోని క్యాస్పియన్ సముద్రంలో లభించే అరుదైన ఆల్బినో బెలూగా స్టర్జన్ చేప గుడ్లతో తయారవుతుంది. ఈ చేప పెరిగేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. దాంతో క్యావియర్ కూడా చాలా అరుదుగా దొరుకుతుంది. దీని ధర కిలోకు 34,500 డాలర్లు వరకు ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 31 లక్షలు. ప్రత్యేకంగా 24 క్యారెట్ బంగారు డబ్బాల్లో విక్రయిస్తారు.
వాగ్యూ బీఫ్ (Wagyu Beef)
జపాన్‌కు చెందిన వాగ్యూ బీఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ మాంసం కోసం పశువులను చాలా కఠినమైన నియమాలతో పెంచుతారు. ప్రత్యేక ఆహారం ఇస్తారు. మాంసంలో కొవ్వు సమానంగా పాకేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీని వల్ల మాంసం చాలా మృదువుగా ఉంటుంది. అసలైన జపనీస్ వాగ్యూ బీఫ్ ధర కిలోకు 500 నుంచి 600 డాలర్లు (రూ. 53,800) వరకు ఉంటుంది.
అయామ్ సెమానీ (Ayam Cemani)
ఇండోనేషియాకు చెందిన అయామ్ సెమానీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోళ్ల జాతుల్లో ఒకటి. ఈ కోడి ప్రత్యేకత ఏమిటంటే దీని చర్మం, మాంసం, ఎముకలు, లోపలి అవయవాలు కూడా పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. ఈ అరుదైన కోడి ధర 2,500 డాలర్లు (రూ. 2 లక్షల పైమాటే) వరకు ఉంటుంది. అక్కడి సంస్కృతిలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
బ్లూఫిన్ ట్యూనా (Bluefin Tuna)
బ్లూఫిన్ ట్యూనా చేపకు జపాన్‌లో చాలా గౌరవం ఉంది. ఈ చేప పొట్ట భాగంలోని మాంసం చాలా ఖరీదైనది. దీన్ని ఓటోరో అని పిలుస్తారు. ప్రసిద్ధ ఫిష్ మార్కెట్లలో ఈ చేపల వేలం కోట్ల రూపాయల్లో జరుగుతుంది. ప్రీమియం మాంసం ధర కిలోకు 5,000 (రూ. 45 లక్షలు) డాలర్లకు పైగా ఉండొచ్చు.

