రోజూ మెంతుల నీరు తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Fenugreek Water: మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే..ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలి. మరి, అవేంటో తెలుసుకుందామా…

మెంతుల్లో పోషకాలు...
మెంతులు రెగ్యులర్ గా మనం వంటలో ఉపయోగిస్తూనే ఉంటాం. ఈ గింజల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
100 గ్రాముల మెంతుల్లో ఎన్ని పోషకాలు ఉంటాయంటే....
శక్తి (Energy): 323 కేలరీలు
ప్రోటీన్ (Protein): 23 గ్రాములు
కొవ్వు (Fat): 6 గ్రాములు
కార్బోహైడ్రేట్స్ (Carbohydrates): 58 గ్రాములు
ఫైబర్ (Fiber): 25 గ్రాములు
ఇనుము (Iron): 33.5 మిల్లీగ్రాములు
కేల్షియం (Calcium): 176 మిల్లీగ్రాములు
మెగ్నీషియం (Magnesium): 191 మిల్లీగ్రాములు
ఫాస్ఫరస్ (Phosphorus): 296 మిల్లీగ్రాములు
పొటాషియం (Potassium): 770 మిల్లీగ్రాములు
సోడియం (Sodium): 67 మిల్లీగ్రాములు
జింక్ (Zinc): 2.5 మిల్లీగ్రాములు
విటమిన్ C: 3 మిల్లీగ్రాములు
విటమిన్ B6: 0.6 మిల్లీగ్రాములు
ఫోలేట్ (Folic Acid): 57 మైక్రోగ్రాములు
షుగర్ లెవల్స్..
మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే కానీ.. దీని వల్ల కొన్ని రకాల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మెంతుల నీటిని రోజూ తాగడం వల్ల డయాబెటిస్, హైపోగ్లైసీమియా రోగులలో షుగర్ లెవల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మదింపజేయడం ద్వారా మెంతులు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని MDPIలో ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతోంది.
వచ్చే సమస్యలు...
ఇప్పటికే రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి లేదా డయాబెటిస్‌కు చికిత్స తీసుకుంటున్న వారికి ఇది గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక పతనానికి కారణమవుతుంది. ఇది తలతిరగడం, అలసట లేదా మూర్ఛకు దారితీయవచ్చు. అందుకే, డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే మెంతుల నీళ్లు తాగాలి. అంతేకాకుండా, రోజూ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
అధికంగా తీసుకుంటే ఏమౌతుంది?
గర్భిణీ స్త్రీలు మెంతుల నీటిని వాడటంలో జాగ్రత్తగా ఉండాలి. మెంతులలో గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే సహజ సమ్మేళనాలు ఉంటాయి. అధికంగా తీసుకోవడం వల్ల గర్భాశయ ఉద్దీపన, అరుదైన సందర్భాల్లో నెలలు నిండకుండానే ప్రసవం లేదా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.
వీరు కూడా తాగకూడదు..
అయోడిన్ శోషణకు ఆటంకం కలిగించే సమ్మేళనాల వల్ల మెంతులు థైరాయిడ్ హార్మోన్ పనితీరును ప్రభావితం చేయవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది హైపోథైరాయిడిజం ఉన్నవారికి, థైరాయిడ్ మందులు వాడేవారికి సమస్యలను సృష్టించవచ్చు. ఎందుకంటే ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది లేదా మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.