పాలలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవు పాలు వాత సమస్యలను తగ్గించి, శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
రాత్రి నిద్రపోవడానికి సుమారు 30 నిమిషాల ముందు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ సమయంలో శరీరం ప్రశాంతంగా ఉండటం మొదలవుతుంది. పాలలోని పోషకాలు మరింత బాగా మనకు అందుతాయి..
పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఎప్పుడూ గోరువెచ్చని పాలు తాగడానికి ప్రయత్నించండి. వీలైతే పాలలో కొద్దిగా పసుపు, యాలకులు లేదా అల్లం కలపడం ఆరోగ్యానికి మంచిది.
అజీర్తి లేదా తరచుగా జలుబు, దగ్గు ఉన్నవారు చల్లని పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..
రోజూ ఒక జామపండు తింటే ఏమౌతుంది?
రాత్రిపూట నిద్ర మంచిగా పట్టాలంటే ఇవి తింటే చాలు!