Cumin: ఈ విషయం తెలిస్తే జీలకర్రను తినకుండా ఉండలేరు
Cumin: జీలకర్రను మనం ప్రతి కూర పోపులో వేస్తుంటాం. ఈ జీలకర్ర బరువును తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఇది పొట్టను కూడా తగ్గిస్తుందని కూడా అంటారు. మరీ దీన్ని రోజూ తింటే ఏమౌతుంది?అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

జీలకర్ర
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ఏ ప్రయత్నం చేసినా అస్సలు బరువు తగ్గరు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఈ సంగతి పక్కన పెడితే కొంతమంది మనం రోజూ పోపులో తినే జీలకర్ర బరువును తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఇది పొట్టను కూడా తగ్గిస్తుందని అంటారు. అసలు దీనిలో నిజమెంతుందో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీలకర్ర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతి ఒక్కరూ జీలకర్రను పోపులో వేస్తుంటారు. ఇది చాలా కామన్. ఎందుకంటే ఇదొక మసాలా దినుసు. ఇది వంటల రుచిని బాగా పెంచుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కొలెస్ట్రాల్ నియంత్రణ
పలు అధ్యయనాల ప్రకారం.. జీలకర్ర ఒంట్లో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్లు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
జీర్ణక్రియను పెంచుతుంది
జీర్ణక్రియను పెంచే లక్షణాలు జీలకర్రలో పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును దీనిలో జీర్ణక్రియకు మేలు చేసే గుణాలుంటాయి. దీన్ని తింటే కడుపులో జీర్ణ ఎంజైములు పెరుగుతాయి. దీంతో తిన్నది సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మన జీర్ణక్రియ బాగా పనిచేస్తేనే మన శరీరంలో ట్యాక్సిన్స్ రిలీజ్ అయ్యి తేలికగా ఉంటుంది.
డయాబెటిస్ కంట్రోల్
జీలకర్ర మధుమేహులకు కూడా చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీలకర్రను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
శరీరంలో మంట తగ్గుతుంది
జీలకర్ర శరీరంలో మంట తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ మసాలా దినుసులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. మీకు తెలుసా? ఈ మంట ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే మంటను వీలైనంత తొందరగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
జీవక్రియ మెరుగుపడుతుంది
జీలకర్ర శరీరంలో జీవక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ అంటే మన తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. కాబట్టి మన జీవక్రియ ఎంత మెరుగ్గా ఉంటే మన శరీరం అంత ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
చాలా మంది జీలకర్ర బరువును తగ్గిస్తుందని అనుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జీలకర్ర నేరుగా మన కొవ్వును కరిగించదు. మీ బరువునూ తగ్గించదు. కానీ ఇది బరువు తగ్గే ప్రక్రియకు సహాయపడుతుంది. అంటే జీర్ణక్రియ, జీవక్రియను మెరుగు పరిచి మీరు బరువు తగ్గేలా చేస్తుంది. అంటే ఈ రెండూ సక్రమంగా ఉన్నప్పుడే మీరు బరువు తగ్గుతారు. కాబట్టి జీలకర్ర మీ జీవక్రియ, జీర్ణక్రియలు మెరుగ్గా ఉండేలా చేసి మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

