Moong dal:పెసర పప్పు రోజూ తింటే బరువు తగ్గుతారా?
Moong Dal: పెసరపప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అధిక ప్రోటీన్,ఫోలేట్, ఫైబర్, విటమిన్ బి6 కూడా ఉంటాయి. పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

Moong dal
ప్రోటీన్ అధికంగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని అత్యంత పోషకాలు ఎక్కువగా ఉండే సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం అని చెప్పొచ్చు. అలాంటి ఫుడ్స్ లో పెసరపప్పు ఒకటి. ఇతర పప్పులతో పోలిస్తే... ఈ పెసరపప్పులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. మరి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం....
పెసరపప్పులో పోషకాలు....
పెసరపప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అధిక ప్రోటీన్,ఫోలేట్, ఫైబర్, విటమిన్ బి6 కూడా ఉంటాయి. బి-కాంప్లెక్స్ సమృద్దిగా ఉండే ఈ పప్పు శరీరం కార్బో హైడ్రేట్ లను గ్లూకోజ్ గా విచ్చిన్నం చేసి మనకు ఎనర్జీగా మార్చడానికి సహాయపడతాయి. ఫోలిక్ ఆమ్లం ఆరోగ్యకరమైన మెదడు, డీఎన్ఏ ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది
బరువు తగ్గించడంలో సహాయపడే పెసరపప్పు....
పెసర పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల ఇతర ఆహారాలు తినలేం. ఫలితంగా... బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది....
పెసర పప్పులో తక్కువ గ్లైసెమిక్ సూచిక శరీరంలో ఇన్సులిన్ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రించడంలో, మధు మేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అధికంగా రక్తంలో షుగర్ ఉన్నవారు కచ్చితంగా పెసరపప్పును తమ డైట్ లో భాగం చేసుకోవాలి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పెసర పప్పు తినడం వల్ల పేగుల్లో బ్యూటిరేట్ అనే కొవ్వు ఆమ్లం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ పప్పులో ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అలాగే, ఇది సులభంగా జీర్ణమవుతుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
పెసరపప్పులో పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అవి అధిక రక్తపోటును తగ్గించడంలో , కండరాల తిమ్మిరిని నివారించడంలో సహాయపడతాయి. అవి శరీరాన్ని క్రమరహిత హృదయ స్పందనల నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి. ఈ పప్పులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చిన్న పిల్లలకు మేలు
ఈ పప్పులో ఉండే వివిధ పోషకాలు పిల్లల ఆరోగ్యం , అభివృద్ధికి సహాయపడతాయి. పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, ఫోలేట్, రిబోఫ్లేవిన్, భాస్వరం, ఫైబర్ , మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది.