MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?

Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?

కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. సీజన్ కి తగ్గట్టుగా వాటిని ఎంపిక చేసుకోవడం అవసరం. ముఖ్యంగా చలికాలంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ కాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Dec 11 2025, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చలికాలంలో ఏ కూరగాయలు తినొచ్చు?
Image Credit : Getty

చలికాలంలో ఏ కూరగాయలు తినొచ్చు?

సాధారణంగా చలికాలంలో శరీరం కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో మనం ఏం తింటున్నామన్నది కీలకం. ముఖ్యంగా కూరగాయల ఎంపిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. కొన్ని కూరగాయలు ఈ సీజన్‌లో శరీరాన్ని వేడిగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరికొన్ని కూరగాయలు జీర్ణ సమస్యలు, కఫం పెరగడం వంటి సమస్యలను తెచ్చే అవకాశముంది. కాబట్టి చలికాలంలో ఏ కూరగాయలు తినొచ్చు? ఏవి తినకూడదో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆకుకూరలు
Image Credit : Getty

ఆకుకూరలు

చలికాలంలో ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ A, C, K, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, దగ్గు, అలసటను తగ్గిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని వేడిగా ఉంచి చలి ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి చలికాలంలో వారానికి రెండు, మూడు సార్లు ఆకుకూరలు తినడం మంచిది.

36
రూట్ వెజిటెబుల్స్
Image Credit : Getty

రూట్ వెజిటెబుల్స్

క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి వంటి కూరగాయలు చలికాలానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇవి భూమిలో పెరుగుతాయి కాబట్టి వేడి స్వభావం కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి లోపల నుంచి వేడి కలిగిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్‌లో ఉండే బీటా-కెరోటిన్, ఐరన్, ఫోలేట్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. చలికాలంలో వీటిని సలాడ్, సూప్, కూరల రూపంలో తీసుకుంటే శరీరానికి చలికి తట్టుకునే శక్తి పెరుగుతుంది.

46
క్రూసిఫెరస్ వెజిటెబుల్స్
Image Credit : Getty

క్రూసిఫెరస్ వెజిటెబుల్స్

కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ వెజిటెబుల్స్ కూడా శరీరానికి చాలా మంచిది. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి వేడి ఇవ్వడంతో పాటు టాక్సిన్లను బయటకు పంపుతాయి. బ్రోకలీలో విటమిన్ సి ఉంటుంది. ఇది చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే దొండకాయ, బెండకాయ వంటి కూరగాయలు కూడా చలికాలంలో తినేందుకు అనువైనవి. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన ఫైబర్ ను అందిస్తాయి.

56
తినకూడని కూరగాయలు
Image Credit : Getty

తినకూడని కూరగాయలు

దోసకాయ, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయల్లో అధికంగా నీరు ఉండడం వల్ల ఇవి శరీరంలో చలిని పెంచుతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం లేదా రాత్రి తీసుకుంటే కఫం, జలుబు సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే చలికాలంలో టమాట కూడా కొందరికి కడుపు సంబంధిత సమస్యలు తీసుకురావచ్చు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చలికాలంలో టమాట తినడం తగ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

66
ఫ్రిజ్ లో నిల్వచేసిన కూరగాయలు
Image Credit : Getty

ఫ్రిజ్ లో నిల్వచేసిన కూరగాయలు

చింతపండు, గుమ్మడికాయ కూడా కొన్ని సందర్భాల్లో శరీరంలో చలిని మరింత పెంచవచ్చు. కాబట్టి మితంగా తినడం మంచిది. అలాగే ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన కూరగాయలు చలికాలంలో శరీరానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. వాటిని తినడం వల్ల ఇమ్యూనిటి తగ్గి సీజనల్ ఇన్ఫెక్షన్లు రావచ్చని హెచ్చరిస్తున్నారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Skin Care: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు!
Recommended image2
Health Tips: చలికాలంలో బెండకాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved