Telugu

టీతో పాటు ఈ స్నాక్స్ అస్సలు తినొద్దు.. ఎందుకో తెలుసా?

Telugu

నూనెలో వేయించిన స్నాక్స్

టీలో ఉండే టానిన్లు, నూనెలో వేయించిన స్నాక్స్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దానివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

Image credits: Freepik
Telugu

మజ్జిగ, పెరుగు

వేడి టీ తాగిన వెంటనే చల్లటి మజ్జిగ లేదా పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రెంటింటి ప్రయోజనం దక్కదు. 

Image credits: Freepik
Telugu

గుడ్డు, ఎగ్ శాండ్‌విచ్

చాలామంది ప్రోటీన్ కోసం ఆమ్లెట్ తో పాటు టీ తీసుకుంటారు. కానీ ఈ కాంబినేషన్ ప్రోటీన్ శోషణను అడ్డుకుంటుంది. అంటే గుడ్డులోని ప్రోటీన్ శరీరానికి సరిగ్గా అందదు.

Image credits: Freepik
Telugu

బ్రెడ్, వెన్న

చాలామంది బ్రెడ్-బటర్, టీ కాంబినేషన్‌ను ఇష్టపడతారు. కానీ బ్రెడ్‌లోని ఈస్ట్, టీలోని మిల్క్ ప్రోటీన్ కలిసి జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. దానివల్ల నీరసం, కడుపు భారంగా అనిపిస్తుంది.

Image credits: Freepik
Telugu

సిట్రస్ పండ్లు

టీ తాగిన వెంటనే నిమ్మరసం, నేరేడు, నారింజ వంటి సిట్రస్ పండ్లు తినకూడదు. టీలోని కెఫిన్, పుల్లటి పదార్థాలు కలిసి పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. కడుపులో మంటను కలిగిస్తాయి.

Image credits: Freepik
Telugu

చాక్లెట్, తీపి పదార్థాలు

చాక్లెట్ లేదా క్రీమ్ బిస్కెట్లతో టీ తాగడం వల్ల బరువు పెరగడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.  

Image credits: Freepik

Moringa Water: రోజూ ఉదయాన్నే మునగాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Chia Seeds: చియా సీడ్స్ ని ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే ఏమౌతుందో తెలుసా?

నెయ్యిని రోజూ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా