వర్కవుట్స్‌తో పనేలేదు.. ఈ పండ్లు తిన్నా వెన్ను నొప్పి తగ్గుతుంది.
గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే వెన్ను నొప్పిని కొన్ని రకాల పండ్లతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

వర్కవుట్స్‌తో పనేలేదు.. ఈ పండ్లు తిన్నా వెన్ను నొప్పి తగ్గుతుంది.
వెన్ను నొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ తీసుకునే ఆహారంతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా.?
వెన్నునొప్పి
వెన్ను నొప్పితో బాధపడేవారికి చాలా మంది వ్యాయామం చేయమని సూచిస్తుంటారు. అయితే తీసుకునే ఆహారం కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
బెర్రీస్
బెర్రీలు కూడా వెన్ను నొప్పిని దూరం చేస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గించడంలో ఉపయోగడపతాయి.
అరటి పండ్లు
అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల అరటిలో 27 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇది ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కండరాలను బలంగా మార్చడంలో దోహదపడుతుంది.
పైనాపిల్
పైనాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నరాల పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
వీటికి దూరం
రెడ్‌మీట్, వేయించిన ఆహారం, ప్రాసెస్ ఫుడ్, షుగర్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వెన్ను నొప్పిక కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
గమనిక..
ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.