MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది

Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది

Cooking Tips: వంట చేస్తూ ఉండగా కొన్నిసార్లు ఉప్పు కొంచెం ఎక్కువైపోతుంది. ఉప్పు ఎక్కువైందంటే ఆ ఫుడ్ పారేయాలి అని అనిపిస్తుంది. కానీ అలా అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఉప్పు తగ్గించి వంటను రుచిగా మార్చుకోవచ్చు. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 03 2026, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వంటలో ఉప్పు ఎక్కువైతే ఫుడ్ పారేయాల్సిన అవసరం లేదు
Image Credit : Getty

వంటలో ఉప్పు ఎక్కువైతే ఫుడ్ పారేయాల్సిన అవసరం లేదు

వంటలో ఉప్పు ఎక్కువైతే ఫుడ్ పారేయాల్సిన అవసరం లేదు. కేవలం చిన్న పొరపాటు వల్ల వంటను వృథా చేయడం బాధగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ సూచనలు చాలా ఉపయోగపడతాయి. కూరలు, పప్పుల్లో ఉప్పు ఎక్కువైతే అందులో కొద్దిగా నీళ్లు కలపడం ఒక సింపుల్ సొల్యూషన్. నీళ్లు కలిపిన తర్వాత కాస్త మరిగించాలి. ఇలా చేస్తే ఉప్పు తగ్గుతుంది. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే రుచి కూడా చూసుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉప్పు లేని ఉడికిన కూరగాయలు వేయడం బెస్ట్ సొల్యూషన్
Image Credit : Getty

ఉప్పు లేని ఉడికిన కూరగాయలు వేయడం బెస్ట్ సొల్యూషన్

ఉప్పు ఎక్కువైన కూరలో ఉప్పు లేకుండా ఉడికించిన కూరగాయలు లేదా పప్పు కలపాలి. అంటే సాంబార్‌లో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా ఉప్పు లేకుండా ఉడికించిన పప్పు వేసి కలిపితే రుచి సర్దుకుంటుంది. ఇది బెస్ట్ సొల్యూషన్. 

Related Articles

Related image1
Salt: ఉప్పులో కూడా కెమికల్స్ ఉంటాయి.. ఇలా శుద్ధి చేసి వాడండి
Related image2
Salt Water: ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..?
35
పాలు, పెరుగు , క్రీమ్ తో టేస్ట్ బ్యాలెన్స్
Image Credit : our own

పాలు, పెరుగు , క్రీమ్ తో టేస్ట్ బ్యాలెన్స్

పిండివంటలలో లేదా గ్రేవీల్లో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా పాలు, పెరుగు , క్రీమ్ కలపడం ద్వారా రుచి బ్యాలెన్స్ అవుతుంది. టమోటా వేసే కూరల్లో కొంచెం చక్కెర లేదా జాగ్రత్తగా బెల్లం వేయడం కూడా ఉప్పు తక్కువగా అనిపించేలా చేస్తుంది. కానీ ఇవి ఎక్కువైతే వంట రుచి మారిపోతుంది కాబట్టి పరిమితంగా వేయాలి.

45
పొడి కూరల్లో బంగాళాదుంప బెటర్
Image Credit : our own

పొడి కూరల్లో బంగాళాదుంప బెటర్

పొడి కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళాదుంప ముక్కలు కలిపితే మంచి ఫలితం ఉంటుంది. బంగాళాదుంపలు ఎక్స్ ట్రా ఉప్పును పీల్చుకుంటాయి. అలాగే చపాతీ ముద్దలో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా ఉప్పు లేకుండా పిండి కలిపి మళ్లీ ముద్ద చేయాలి. 

55
నిమ్మరసం వేస్తే ఉప్పు తగ్గి రుచి పెరుగుతుంది
Image Credit : Getty

నిమ్మరసం వేస్తే ఉప్పు తగ్గి రుచి పెరుగుతుంది

రసం, సూప్ వంటి వంటల్లో బియ్యం పిండిని కలిపి మరిగిస్తే కూడా ఉప్పు తగ్గుతుంది. కొంతమంది నిమ్మరసం చుక్కలు వేస్తారు. పులుపు వల్ల ఉప్పు తక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉప్పు వేసేటప్పుడు కొద్దికొద్దిగా వేసి రుచి చూస్తూ వేయడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేయడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. వంట చివర్లో ఉప్పు సర్దుబాటు చేయడం మంచిది. మొత్తానికి, వంటలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న మార్పులతో రుచి సరిచేసుకోవచ్చు. సరైన టిప్ పాటిస్తే వంట మళ్లీ రుచిగా మారుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Salt: ఉప్పులో కూడా కెమికల్స్ ఉంటాయి.. ఇలా శుద్ధి చేసి వాడండి
Recommended image2
Salt Water: ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved