MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..

Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..

Onion Storage: ఎండాకాలంలో ఉల్లిపాయలు చాలా తొందరగా  మొలకెత్తుతాయి. లేదంటే కుళ్లిపోతాయి. ఇలా అవ్వకుండా… ఎక్కువ రోజులు ఉల్లిపాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 25 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉల్లిపాయలు ఎలా స్టోర్ చేస్తున్నారు?
Image Credit : Asianet News

ఉల్లిపాయలు ఎలా స్టోర్ చేస్తున్నారు?

ఉల్లిపాయలు ఎవరైనా  ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అయితే.. తెచ్చిన కొద్ది రోజులకే ఉల్లిపాయల నుంచి మొలకలు రావడం మొదలౌతుంది. ఇలా మొలక వచ్చిన ఉల్లిపాయలు తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి మొలకలు  వచ్చిన ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. బంగాళదుంప మాత్రమే మొలకెత్తిన తర్వాత తినకూడదు. కానీ, అసలు మొలకెత్తకుండా ఉల్లిని ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొలకెత్తిన ఉల్లిపాయలు ఏం చేయాలి?
Image Credit : Getty

మొలకెత్తిన ఉల్లిపాయలు ఏం చేయాలి?

ఉల్లిపాయలపై పచ్చని మొలకలు కనిపిస్తే ఏం చేయాలో అని చాలామంది ఆలోచిస్తారు. వాటిని పడేయాల్సిన అవసరం లేదు. అవి స్ప్రింగ్ ఆనియన్స్ లాగే ఉంటాయి. కాబట్టి వాటిని కట్ చేసి కూరలు, సాంబార్, సలాడ్లలో వాడుకోవచ్చు. కానీ ఉల్లిపాయ మెత్తబడిపోయినా, నీరు చేరి పురుగులు పట్టినా వెంటనే పడేయడం మంచిది.
35
మొలకెత్తకుండా ఎలా స్టోర్ చేయాలి?
Image Credit : Asianet News

మొలకెత్తకుండా ఎలా స్టోర్ చేయాలి?

ఉల్లిపాయలు మొలకెత్తకుండా ఉండాలంటే, కొన్న వెంటనే వాడేయడమే సులభమైన మార్గం. కానీ మీరు ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కొంటే, వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. మొలకలు రాకుండా ఎలా నిల్వ చేయాలో చూద్దాం…

ఉల్లిపాయలు తాజాగా ఉండాలంటే వాటిని తేమ, వేడి, వెలుతురు తగలని చోట పెట్టాలి. చల్లగా, పొడిగా, గాలి తగిలేలా ఉండే ప్యాంట్రీ లేదా స్టోర్ రూమ్‌లో నిల్వ చేయడం ఉత్తమం. ప్లాస్టిక్ కవర్లలో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే అవి తేమను పట్టి ఉంచి, ఉల్లిపాయలు త్వరగా పాడయ్యేలా చేస్తాయి. బదులుగా, వల సంచులు లేదా కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో ఉంచండి.

45
ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదు..
Image Credit : Freepik

ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదు..

ఫ్రిజ్‌లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల, అందులో గడ్డలుగా ఉన్న ఉల్లిపాయలను నిల్వ చేయకూడదు. అలా చేస్తే ఉల్లిపాయలు మెత్తబడి త్వరగా పాడవుతాయి. కానీ, తరిగిన ఉల్లిపాయలను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో 4–5 రోజులు నిల్వ చేయవచ్చు. ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే, వాటిని కట్ చేసి ఫ్రీజర్‌లో పెట్టొచ్చు. కానీ ఫ్రీజ్ చేసిన ఉల్లిపాయల రుచి మారుతుంది. కాబట్టి వాటిని వంటకు మాత్రమే వాడాలి.
55
ఈ తప్పు చేయకూడదు..
Image Credit : our own

ఈ తప్పు చేయకూడదు..

బంగాళదుంపలతో పాటు ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయవద్దు. ఎందుకంటే అవి తేమను పెంచి, రెండూ త్వరగా పాడయ్యేలా చేస్తాయి. ఉల్లిపాయలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ, పాడైపోయిన వాటిని వెంటనే పడేయండి. లేదంటే మిగతా ఉల్లిపాయలన్నీ పాడవడం ఖాయం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Cucumber: కీరదోస చేదుగా ఉందా? ఇలా చేస్తే.. చేదు పోతుంది..!
Recommended image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved