Telugu

Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా

Telugu

నిమ్మ, పచ్చిమిర్చి

ఎక్కువ శ్రమ లేకుండా నిమ్మకాయ పచ్చడి. ఈ పికిల్ వేసుకుని తింటే మెతుకు కూడా మిగల్చరు. గిన్నెలో 12 నిమ్మకాయలు, 250 గ్రాముల పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోయండి. 

Image credits: Puviya kitchen instagram
Telugu

నానబెట్టిన చింతపండు

నిమ్మకాయ, పచ్చిమిర్చి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కనే కొద్దిగా వేడి నీటిలో నిమ్మకాయంత చింతపండు నానబెట్టండి.

Image credits: Puviya kitchen instagram
Telugu

తాలింపు ఇలా

ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె వేసి వేగాక ఆవాలు, మెంతులు వేపండి. తర్వాత వాటిని రోట్లో వేసి పొడి చేసుకోవాలి.

Image credits: Puviya kitchen instagram
Telugu

నిమ్మకాయ గింజలు

ఉడికించిన నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి గింజలు తీసేయండి. మిక్సీ జార్‌లో ఉడికించిన పచ్చిమిర్చి, చింతపండు వేసి గ్రైండ్ చేయండి.

Image credits: Puviya kitchen instagram
Telugu

వెల్లుల్లితో పోపు

పోపు గిన్నెలో నూనె వేసి, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. దానికి కొద్దిగా ఇంగువ కూడా కలపండి. దానిలోనే రుచి మొత్తం ఉంటుంది.

Image credits: Puviya kitchen instagram
Telugu

చివరగా కుక్కర్‌లో...

అన్నింటినీ కుక్కర్ గిన్నెలోకి మార్చండి. చిటికెడు పసుపు, ఒక చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అంతే, పచ్చడి రెడీ. దీన్ని ఒక సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోండి. 

Image credits: Puviya kitchen instagram

Masala Chai : వానాకాలంలో ఇలా స్పెషల్ మసాలా చాయ్ చేసి తాగితే ఉంటుందీ...

Moringa Benefits: ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండవు

Poori: హోటల్ స్టైల్ లో పూరీలు బాగా పొంగాలంటే ఇదొక్కటి చేస్తే చాలు

Carabao Mango : ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే!