MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Cucumber: కీరదోస చేదుగా ఉందా? ఇలా చేస్తే.. చేదు పోతుంది..!

Cucumber: కీరదోస చేదుగా ఉందా? ఇలా చేస్తే.. చేదు పోతుంది..!

 Cucumber: కీరదోస కొంటే.. చేదుగా మారిందా? చేదు అయ్యిందని పారేస్తున్నారా? కానీ.. ఆ చేదు కీరదోస కాయను కూడా మళ్లీ తియ్యగా మార్చుకోవచ్చు. హ్యాపీగా తినేయచ్చు 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 25 2026, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
cucumber..
Image Credit : Getty

cucumber..

ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో కీరదోస కూడా ఒకటి. ఈ కీరదోసకాయలో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనిలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

కీరదోసకాయలో 95 నుంచి 96 శాతం నీరు ఉంటుంది. అందువల్ల..ఈ కీరదోస తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. హైడ్రేటెడ్ గా కూడా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే.. ఒక్కోసారి కీరదోస కొన్నప్పుడు తిందాం అంటే చేదుగా ఉంటాయి. అలా చేదుగా ఉన్నవాటిని పారేస్తూ ఉంటాం. కానీ.. వాటిని మనం మళ్లీ తియ్యగా చేసుకోవచ్చు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  కీరదోసకాయలో చేదును తొలగించే ట్రిక్స్..
Image Credit : Getty

కీరదోసకాయలో చేదును తొలగించే ట్రిక్స్..

1.అంచులు కత్తిరించి రుద్దాలి....

కీరదోసకాయ ను ముందుగా నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత, కీరదోస రెండు చివరలను కత్తిరించాలి. కత్తిరించిన చివర్లను కీరదోసను గుండ్రంగా రుద్దాలి. దీని వల్ల తెల్లటి నురుగు వస్తుంది. ఇప్పుడు, కీరదోసకాయ ముందు, వెనక భాగాల నుండి చిన్న ముక్కను కట్ చేసి పక్కన పెట్టాలి. ఇలా చేస్తే కాయలో చేదు పోతుంది. దోసకాయ తినడానికి బాగుంటుంది.

2. కీర దోసకాయను సగానికి కట్ చేయాలి..

చేదును తొలగించడానికి దానిని నీటితో కడగాలి. తర్వాత కీరదోసను రెండు ముక్కలుగా కట్ చేయాలి. తరువాత దోసకాయ ముందు, వెనుక భాగాలను కత్తిరించి పారవేయండి. ఇలా చేయడం వల్ల దోసకాయ చేదుగా మారకుండా ఉంటుంది.

3. కీర దోసకాయకు ఉప్పు రాయండి

కీర దోసకాయ రెండు చివర్ల నుండి కొద్దిగా కట్ చేయాలి. ఇప్పుడు దానిపై ఉప్పు చల్లి కాసేపు పక్కన పెట్టాలి. కట్ చేసిన చిరవ ముక్కులతో ముక్కు వేసిన దానిపై రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత తిన్నా చేదు పోతుంది. లేదంటే.. ఈ కీరదోసను చివరలు కట్ చేసి... ఉప్పు నీటిలో 5 నిమిషాలు నానపెట్టినా సరిపోతుంది. ఇలా చేసినా చేదు ఉండదు.

33
4. చల్లటి నీటిలో నానబెట్టండి
Image Credit : Getty

4. చల్లటి నీటిలో నానబెట్టండి

చేదును తొలగించడానికి, కీరా ముక్కలను 5-10 నిమిషాల పాటు చల్లటి నీటిలో నానబెట్టండి. ఇది చేదు రుచిని తొలగించి, వాటిని తాజాగా కనిపించేలా చేస్తుంది.

5.తొక్క తీసేస్తే చాలు..

కీరదోసలో చాలా చేదు దాని తొక్కలోనే ఉంటుంది. కాబట్టి, కీరదోస తొక్క తీసేసి తిన్నా చేదు ఉండదు.

6. సరైన దోసకాయను ఎంచుకోండి

దోసకాయలు కొనేటప్పుడు, ఎల్లప్పుడూ తాజాగా, గట్టిగా, కొద్దిగా పచ్చగా ఉన్నవాటినే ఎంచుకోండి. బాగా పండిన లేదా పసుపు రంగులోకి మారిన దోసకాయలు తరచుగా చేదుగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Cucumber: దోసకాయ రాత్రిపూట తింటే ఏమవుతుంది?
Recommended image2
Women Secrets: అమ్మాయిల పెదాలు చూసి వాళ్లు ఎలాంటివాళ్లో చెప్పేయచ్చు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved