చియా సీడ్స్ అతిగా తింటే ఏమౌతుంది? రోజుకి ఎంత తీసుకోవాలి?
Chia Seeds: ఈరోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండాలని చియా సీడ్స్ తీసుకుంటున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

chia seeds
చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ చియా సీడ్స్ ని తమ డైట్ లో భాగం చేసుకుంటున్నారు. ఈ చియా సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఎన్ని పోషకాలు ఉన్నా కూడా అవసరానికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే, వీటిని అతిగా తీసుకోకూడదు. రోజూ మితంగా తీసుకుంటనే ఆరోగ్యానికి మంచిది.
ఎంత తినాలి
చియా సీడ్స్ పోషకాలన్నీ మనకు అందాలంటే తగిన మోతాదులో తీసుకోవాలి. పెద్దవాళ్లు రోజుకి రెండు టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ తినొచ్చు. ఇంతకన్నా ఎక్కువగా అయితే తీసుకోకూడదు.
ఎలా తినాలి? ఎవరు తినకూడదు?
చియా సీడ్స్ ని డైరెక్ట్ గా తీసుకోకూడదు. అంటే.. పొడిగా తీసుకోకూడదు. బదులుగా నీటిలో నానబెట్టి తినడం మంచిది. నీళ్లు, పాలు, పెరుగులో నానబెట్టి తినడానికి ప్రయత్నించాలి.
ఈ చియా సీడ్స్ ని అందరూ తీసుకోకూడదు. కొందరు ఫైబర్ తక్కువగా తీసుకోవాల్సిన వాళ్లు ఉంటారు. అలాంటివారు… ఈ చియా సీడ్స్ కి దూరంగా ఉండటే మంచిది. వీటిని డైట్ లో భాగం చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
చియా సీడ్స్ తో ప్రయోజనాలు..
చియా సీడ్స్ లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం, జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. అలాగే చర్మం హైడ్రేట్ గా, కాంతివంతంగా ఉంటుంది. అలాగే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండూ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి.