Chia Seeds vs Sabja Seeds: చియా సీడ్స్ vs సబ్జా సీడ్స్.. బరువు తగ్గడానికి ఏవి మంచివి
Chia Seeds vs Sabja Seeds:చియా సీడ్స్, సబ్జా సీడ్స్ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఈ రెండింటిలో ఏవి తింటే తొందరగా బరువు తగ్గుతామని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

చియా విత్తనాలు, సబ్జా విత్తనాలు
చియా విత్తనాలు, సబ్జా విత్తనాలు రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అలాగే ఈ రెండూ మనం హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇలా మీరు బరువు తగ్గడానికి ఈ రెండూ సహాయపడతాయి. కానీ ఈ రెండింటిలో ఏది తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతామని డౌట్ వస్తుంటుంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చియా సీడ్స్, సబ్జా సీడ్స్ లోని పోషక విలువలు
సబ్జా సీడ్స్ లో కంటే చియా సీడ్స్ లోనే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చీయా సీడ్స్ లో సుమారుగా 34 గ్రాముల ఫైబర్ ఉంటే, సబ్జా సీడ్స్ లో కేవలం 22 గ్రాముల ఫైబరే ఉంటుంది. అలాగే చియా సీడ్స్ లో కంటే సబ్జా సీడ్స్ లోనే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
పోషకాలు
ఇకపోతే చియా విత్తనాల్లో సబ్జా సీడ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కండరాలను బలంగా ఉంచడానికి, ఆకలిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ప్రోటీన్ బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. అయితే కేలరీల పరంగా చూసుకున్నట్టైతే సబ్జా సీడ్స్ లోనే కేలరీలు తక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే సబ్జా సీడ్స్ లో మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే, విలమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి విటమిన్లు సబ్జా సీడ్స్ లో పుష్కలంగా ఉంటాయి.
చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
చియా సీడ్స్, సబ్జా సీడ్స్ లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం, జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. అలాగే చర్మం హైడ్రేట్ గా, కాంతివంతంగా ఉంటుంది. అలాగే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండూ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి.
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
చియా సీడ్స్, సబ్జా సీడ్స్ రెండూ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాబట్టి మీ శరీర అవసరాలను బట్టి ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యే డైట్ లో ఈ రెండింటినైనా లేదా ఏ ఒక్కదాన్నైనా తీసుకోవచ్చు. బరువు తగ్గాలంటే మంచి ఆహారాన్నే కాకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరం.