జామపండులో విటమిన్ ఎ, సి, విటమిన్ బి2, కె, ఫైబర్, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి రోజూ ఒక జామపండు తింటే చాలు. దీనిలోని విటమిన్ సి, పొటాషియం కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తాయి.
జామపండులోని పొటాషియం రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది.
వయసు పెరగడం వల్ల వచ్చే కంటిచూపు సమస్యను తగ్గించుకోవడానికి రోజూ జామపండు జ్యూస్ తాగొచ్చు. 100 గ్రాముల జామపండులో కేవలం 68 కేలరీలు, 8.92 గ్రాముల చక్కెర ఉంటుంది.
విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, సాధారణ ఇన్ఫెక్షన్లు, వ్యాధికారకాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో లైకోపీన్ పుష్కలంగా ఉన్న జామపండు చాలా మంచిది.
ఫైబర్ కంటెంట్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మధుమేహం ప్రమాదాన్ని నివారిస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది.