MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • Fruits: రాత్రిపూట పండ్లు తినొచ్చా? వేటిని అస్సలు తినకూడదు..?

Fruits: రాత్రిపూట పండ్లు తినొచ్చా? వేటిని అస్సలు తినకూడదు..?

Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ,  రాత్రి పూట తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  వేటిని తినాలి? వేటిని తినకూడదు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 08 2025, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాత్రిపూట పండ్లు...
Image Credit : Getty

రాత్రిపూట పండ్లు...

రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, వాటిని మనం ఏ సమయంలో తింటున్నామనేది కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే, రాత్రిపూట శరీరంలో మెటబాలిజం కొద్దిగా మందగిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకుంటే అది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక, ఈ సమయంలో పండ్లు తింటే షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయని అంటారు. మరి, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ పండ్లు తినవచ్చు...
Image Credit : Getty

ఈ పండ్లు తినవచ్చు...

రాత్రిపూట పడుకునే ముందు పండ్లు తినడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ... ఏ పండ్లు తింటున్నాం అనేది ముఖ్యం. సరైన పండ్లను ఎంచుకోవడంతో పాటు.. సరైన పద్దతిలో కూడా తినాలి. ముఖ్యంగా సులభంగా జీర్ణమయ్యేలా, తేలికగా శరీరానికి శక్తిని అందించేవి ఎంచుకోవాలి. అంటే యాపిల్, బొప్పాయి. పియర్స్, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లు రాత్రిపూట తినవచ్చు. ముఖ్యంగా బొప్పాయిలో ఉన్న ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక రాత్రిపూట దానిమ్మ తినడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. అయితే.. మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తీసుకోవాలి.

Related Articles

Related image1
Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు తినడం ఎంత ప్రమాదమో
Related image2
Winter Care: చలికాలంలో ఈ గింజలు తిన్నా చాలు, జుట్టు రాలదు, కీళ్ల నొప్పులకు చెక్
34
వీటిని మాత్రం పొరపాటున కూడా తినకూడదు...
Image Credit : Getty

వీటిని మాత్రం పొరపాటున కూడా తినకూడదు...

అయితే, కొన్ని పండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదు. ముఖ్యంగా మామిడి పండు, అరటి పండు, ద్రాక్ష, సపోటా వంటి షుగర్ ఎక్కువగా ఉండే పండ్లు ఈ సమయంలో తినడం మంచిది కాదు. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెంచి, జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతాయి. అదేవిధంగా నేరేడు లాంటి పండ్లు కూడా రాత్రిపూట కూడా తీసుకోకూడదు. గ్యాస్, బ్లోటింగ్, కడుపు అసౌకర్యం కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నిరంతరం అసిడిటీ, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు.

44
పండ్లు ఎలా తినాలి..?
Image Credit : Getty

పండ్లు ఎలా తినాలి..?

పండ్లు తినే సమయానికి తోడు వాటిని ఎలా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. రాత్రి పండ్లు తినాలంటే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం ఒక గంట తర్వాత తినాలి. అలాగే పండ్లతో చేసిన ఫ్రూట్ సలాడ్లు, మిక్స్ చేసిన పండ్లతో పాటు పాలు, పెరుగు కలిపి తినడం మంచిది కాదు. అలా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా తినాలి. ఎక్కువ క్వాంటిటీలో రాత్రిపూట అస్సలు తినకూడదు. చిన్న బౌల్ లో మాత్రమే తినాలి.

మొత్తం మీద, రాత్రి పూట పండ్లు తినకూడదనే అభిప్రాయం పూర్తిగా తప్పు కాదు కానీ సరైన పండ్లను ఎంచుకుంటే శరీరానికి ఎలాంటి హాని ఉండదు. తేలికపాటి, ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు మాత్రమే తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ దెబ్బతినకుండా, మంచి నిద్రకు సహాయపడే పండ్లను మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పగటి సమయంలోనే పండ్లను తినడం ఉత్తమం,

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు తినడం ఎంత ప్రమాదమో
Recommended image2
Winter Care: చలికాలంలో ఈ గింజలు తిన్నా చాలు, జుట్టు రాలదు, కీళ్ల నొప్పులకు చెక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved