MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?

Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?

Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ అనే పేర్లు వింటే చాలా మంది ఇవి దాదాపు ఒకే రకమైన వంటకాలు అనుకుంటారు. కానీ వాస్తవానికి బిర్యానీ, పులావ్ మధ్య తయారీ విధానం నుంచి రుచి వరకు ఎన్నో తేడాలు ఉన్నాయి. ఇంత‌కీ ఆ తేడాలేంటో తెలుసా.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 09 2026, 08:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిర్యానీ, పులావ్ ఒకటే అనుకోవడం ఎందుకు తప్పు?
Image Credit : Gemini AI

బిర్యానీ, పులావ్ ఒకటే అనుకోవడం ఎందుకు తప్పు?

చాలా మందికి పులావ్ అంటే వెజిటేరియన్, బిర్యానీ అంటే నాన్‌వెజ్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ అది సరైనది కాదు. పులావ్, బిర్యానీ రెండూ వెజ్, నాన్‌వెజ్ రూపాల్లో లభిస్తాయి. రెండింటిలోనూ బియ్యం, మసాలాలు, కూరగాయలు లేదా మాంసం ఉపయోగిస్తారు. అయితే వాటి తయారీ విధానం, మసాలాల వినియోగం, రుచి, వడ్డించే తీరు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే బిర్యానీని పులావ్‌తో పోల్చడం కంటే రెండింటి ప్రత్యేకతలను అర్థం చేసుకోవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పులావ్ తయారీ విధానం చాలా సులభం
Image Credit : Getty

పులావ్ తయారీ విధానం చాలా సులభం

పులావ్ తయారీలో సాధారణంగా బియ్యం, కూరగాయలు లేదా మాంసం, మసాలాలు అన్నింటినీ ఒకేసారి ఒకే పాత్రలో వేస్తారు. తర్వాత నీరు పోసి ఉడికిస్తారు. దీనిని "అబ్జార్ప్షన్ మెథడ్" అంటారు. అంటే వంట సమయంలో నీరు పూర్తిగా పదార్థాల్లో కలిసిపోతుంది. ఈ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తవుతుంది. మసాలాల వినియోగం కూడా పరిమితంగానే ఉంటుంది. అందువల్ల పులావ్ రుచి తేలికగా, సింపుల్‌గా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో దీనిని కర్రీలు, దాల్ లేదా ఇతర సైడ్ డిష్‌లతో కలిపి తింటారు.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Related image2
Egg Curry: ఎగ్ క‌ర్రీ ఇలా చేశారంటే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా బ‌లాదూర్‌. నోరూరించే త‌వా మ‌సాలా
36
బిర్యానీ తయారీ ఒక కళలాంటిది
Image Credit : our own

బిర్యానీ తయారీ ఒక కళలాంటిది

బిర్యానీ తయారీ మాత్రం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ముందుగా బియ్యాన్ని కొంతవరకు ఉడికిస్తారు. అలాగే మాంసం లేదా కూరగాయలను మసాలాలతో వేరు వేరు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పాత్రలో పొరలుగా అమర్చి వంట చేస్తారు. కింద బియ్యం, మధ్యలో మాంసం లేదా కూరగాయలు, పైభాగంలో మళ్లీ బియ్యం వేసి, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి, మసాలాలు కలుపుతారు. అనంతరం పాత్రను మూసివేసి తక్కువ మంటపై ఉడికిస్తారు. ఈ విధానాన్ని "దమ్ కుకింగ్" అని పిలుస్తారు. అందుకే బిర్యానీ తయారికి ఎక్కువ సమయం పడుతుంది.

46
మసాలాలు, సువాసనలోనే అసలు తేడా
Image Credit : AI Image

మసాలాలు, సువాసనలోనే అసలు తేడా

బిర్యానీకి ప్రత్యేకమైన రుచి, సువాసన రావడానికి ఎన్నో రకాల మసాలాలు ఉపయోగిస్తారు. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలు బిర్యానీని మరింత రుచికరంగా మారుస్తాయి. పులావ్‌లో మాత్రం మసాలాల వినియోగం తక్కువగా ఉంటుంది. అందువల్ల పులావ్ రుచి సున్నితంగా ఉంటే, బిర్యానీ ఘాటు, ఘుమఘుమలాడే సువాసనతో ఆకట్టుకుంటుంది.

56
మూలాలు, వడ్డించే విధానంలోనూ తేడా
Image Credit : AI Image

మూలాలు, వడ్డించే విధానంలోనూ తేడా

చారిత్రకారుల అభిప్రాయం ప్రకారం బిర్యానీ మూలాలు పర్షియాలో ఉన్నాయి. "బిరియన్" అనే పర్షియన్ పదం నుంచి బిర్యానీ అనే పేరు వచ్చిందని చెబుతారు. మరోవైపు పులావ్ మధ్య ఆసియా ప్రాంతాల్లో పుట్టి తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది. వడ్డించే విధానంలో కూడా తేడా ఉంది. పులావ్‌ను సాధారణంగా ఒక సైడ్ డిష్‌గా లేదా కర్రీతో కలిసి వడ్డిస్తారు. కానీ బిర్యానీ మాత్రం పూర్తి భోజనంగా భావిస్తారు. దీనికి రాయితా, సలాడ్‌, చట్నీ వంటి వాటిని మాత్రమే జత చేస్తారు.

66
బిర్యానీ, పులావ్ రెండింటికీ ప్రత్యేక స్థానం
Image Credit : gemini ai

బిర్యానీ, పులావ్ రెండింటికీ ప్రత్యేక స్థానం

బిర్యానీ, పులావ్ రెండూ రుచికరమైన వంటకాలే. కానీ ఇవి ఒకటే కాదు. పులావ్ సరళమైన వంటకం అయితే, బిర్యానీ మసాలాలు, పొరలు, దమ్ కుకింగ్‌తో తయారయ్యే ప్రత్యేక వంటకం. అందుకే బిర్యానీ అభిమానులు అసలైన బిర్యానీ రుచిని పులావ్‌తో పోల్చలేమని చెబుతుంటారు. తర్వాత ఎప్పుడైనా మీరు పులావ్ లేదా బిర్యానీ ఆర్డర్ చేసే ముందు ఈ తేడాలను గుర్తుంచుకోండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆహారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image2
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image3
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Recommended image2
Egg Curry: ఎగ్ క‌ర్రీ ఇలా చేశారంటే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా బ‌లాదూర్‌. నోరూరించే త‌వా మ‌సాలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved