MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Custard Apple: రోజూ ఒక సీతాఫలం తింటే ఏమౌతుందో తెలుసా?

Custard Apple: రోజూ ఒక సీతాఫలం తింటే ఏమౌతుందో తెలుసా?

ఎన్నో పోషకాలతో నిండి ఉన్న సీతా ఫలం పండును రోజూ ఒకటి తింటే మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 06 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సీతాఫలంతో ప్రయోజనాలు..
Image Credit : Getty

సీతాఫలంతో ప్రయోజనాలు..

సీతాఫలం ఒక సీజనల్ ఫ్రూట్. రుచికి తియ్యగా ఉండే ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సహజంగా ఈ పండు మనకు శీతాకాలంలో లభిస్తుంది. కానీ, చలికాలం మొదలు కాకముందే.. మార్కెట్లో ఈ పండ్లు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి, ఈ పండును ప్రతిరోజూ ఒకటి తింటే.. మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా...

సీతాఫలంలో పోషకాలు..

సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు శరీరానికి అవసరయ్యే శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

DID YOU
KNOW
?
విటమిన్ సి
సీతాఫలంలో ఉన్న విటమిన్ సి, ఒక నారింజలో ఉన్న విటమిన్ C కంటే ఎక్కువగా ఉంటుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోగనిరోధక శక్తిని పెంచే సీతాఫలం..
Image Credit : Getty

రోగనిరోధక శక్తిని పెంచే సీతాఫలం..

సీతాఫలంలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది. దీని వల్ల మనల్ని మనం అనేక వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా చలి, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో మేలు చేస్తుంది.

జీర్ణక్రియకు మేలు

సీతాఫలంలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రక్తహీనత నివారణ

రక్తహీనత (Anemia) తో బాధపడేవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులోని ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి, అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Related Articles

Related image1
Dry fruits : ఈ డ్రైఫ్రూట్స్‌ని నానబెట్టి తింటే.. దిమ్మతిరిగే లాభాలు..
Related image2
Fruits For Diabetes: షుగర్ పేషెంట్లు ఈ పండ్లను హ్యాపీగా తినొచ్చు!
34
 కంటిచూపు మెరుగుపరిచే సీతాఫలం..
Image Credit : Getty

కంటిచూపు మెరుగుపరిచే సీతాఫలం..

బీపీ నియంత్రణ

అధిక రక్తపోటుతో బాధపడేవారికి సీతాఫలం మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కంటి ఆరోగ్యం

సీతాఫలంలో విటమిన్ A, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి కణజాలాన్ని రక్షించి, వయస్సుతో వచ్చే చూపు సమస్యలను నివారించడంలో ఇది ఉపయోగకరం.

44
బరువు తగ్గడంలో సహాయం
Image Credit : Getty

బరువు తగ్గడంలో సహాయం

సీతాఫలంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ పండు చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గాలి అనుకునేవారి డైట్‌లో చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తొందరగా కలగదు. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఫైనల్ గా...

సీతాఫలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక సహజ వైద్యంలా పనిచేస్తుంది. ఈ పండును మనం మితంగా తింటే శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Dry fruits : ఈ డ్రైఫ్రూట్స్‌ని నానబెట్టి తింటే.. దిమ్మతిరిగే లాభాలు..
Recommended image2
Fruits For Diabetes: షుగర్ పేషెంట్లు ఈ పండ్లను హ్యాపీగా తినొచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved