Telugu

Dry fruits : ఈ డ్రైఫ్రూట్స్‌ని నానబెట్టి తింటే.. దిమ్మతిరిగే లాభాలు..

Telugu

నానబెట్టిన డ్రైప్రూట్స్

ఖాళీ కడుపుతో ఉదయాన్నే నానబెట్టిన బాదం, అంజీర్, ద్రాక్ష, వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మేలు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తి స్థాయిలను పెంచుతాయి,  

Image credits: Freepik
Telugu

రోగనిరోధక శక్తి

నీటిలో నానబెట్టిన బాదం, వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Image credits: Freepik
Telugu

మెదడు పనితీరు

బాదం, వాల్‌నట్స్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

Image credits: Freepik
Telugu

గుండె పదిలం

ద్రాక్ష, వాల్‌నట్స్ రెండూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వాల్‌నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: Freepik
Telugu

మెరుగైన జీర్ణక్రియ

నీటిలో నానబెట్టిన ద్రాక్ష, అంజీర్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Image credits: Freepik
Telugu

జుట్టు ఆరోగ్యం

బాదం, జీడిపప్పు,  ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

Image credits: Getty
Telugu

బరువు నియంత్రణ

డ్రైఫ్రూట్స్ లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా కలిగి ఉంటాయి. కొద్దిపాటి డ్రైఫ్రూట్స్ తినడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. ఆకలి తగ్గినా.. ఎనర్జీ లెవల్స్ హైలోనే.  

Image credits: Getty

Cardamom: రోజూ రెండు యాలకులు తింటే.. ఎన్ని లాభాలో?

Cheese: చీజ్ ఆరోగ్యానికి మంచిదేనా ? అతిగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో గుడ్ బై చెప్పండి

Health Tips: షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే సూపర్ డ్రింక్స్ ఇవే..