MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • Beetroot : పచ్చిగానా? ఉడికించా? రోజూ బీట్‌రూట్ తింటే బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే !

Beetroot : పచ్చిగానా? ఉడికించా? రోజూ బీట్‌రూట్ తింటే బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే !

Beetroot Raw vs Boiled : బీట్‌రూట్ పచ్చిగా తింటే మంచిదా లేక ఉడికించి తింటేనా? కిడ్నీలో రాళ్లు రాకుండా, పూర్తి పోషకాలు అందాలంటే ఏ పద్ధతి బెస్ట్? బీట్‌రూట్ తినడం వల్ల మీ బాడీలో జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 06 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే బీట్‌రూట్ ఇలా ట్రై చేయండి
Image Credit : Gemini

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే బీట్‌రూట్ ఇలా ట్రై చేయండి

బీట్‌రూట్.. దీన్ని హెల్తీ సూపర్ ఫుడ్స్‌కు కింగ్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే నైట్రేట్స్, బెటాలైన్స్, ఫోలేట్, విటమిన్ సి గుండెకు, జీర్ణక్రియకు, ఇమ్యూనిటీకి చాలా మంచిది. గతేడాది బీట్‌రూట్ షాట్స్ ట్రెండ్ ఎంతలా నడిచిందో మనందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటంటే.. బీట్‌రూట్ పచ్చిగా తింటే మంచిదా? లేక ఉడికించి తింటేనా? కొందరేమో పచ్చిగా తింటేనే పోషకాలు ఉంటాయి అంటున్నారు, మరికొందరేమో కిడ్నీలో రాళ్లు వస్తాయని భయపడుతున్నారు. మరి సైన్స్ ఏం చెబుతుందో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బీట్‌రూట్ న్యూట్రిషన్ లెక్కలు ఇవే
Image Credit : Getty

బీట్‌రూట్ న్యూట్రిషన్ లెక్కలు ఇవే

100 గ్రాముల పచ్చి బీట్‌రూట్‌లో 43 క్యాలరీలు, 2.8 గ్రాముల ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. అదే ఉడికించిన బీట్‌రూట్‌లో 44 క్యాలరీలు ఉంటాయి కానీ విటమిన్ సి, బెటాలైన్స్ కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే ఇవి వేడికి తట్టుకోలేవు. అయితే పొటాషియం, ఫోలేట్ మాత్రం ఉడికించినా అంతే ఉంటాయి.

36
పచ్చి బీట్‌రూట్: పవర్‌హౌస్ కానీ జాగ్రత్త !
Image Credit : Getty

పచ్చి బీట్‌రూట్: పవర్‌హౌస్ కానీ జాగ్రత్త !

చాలామంది సలాడ్లు, జ్యూస్‌ల రూపంలో పచ్చి బీట్‌రూట్ తీసుకోవడానికే ఇష్టపడతారు. ఇలా తీసుకోవడం వల్ల నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతాయి, బీపీని తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు 8 వారాల పాటు పచ్చి బీట్‌రూట్ తింటే డయాబెటిస్‌ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని, లివర్ ఎంజైమ్స్ మెరుగుపడతాయని స్టడీస్ చెబుతున్నాయి.

అయితే, పచ్చి బీట్‌రూట్‌లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు రావడానికి కారణం కావచ్చు. అలాగే అరగడం కూడా కొంచెం కష్టమే. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

46
ఉడికించిన బీట్‌రూట్: సేఫ్ అండ్ ఈజీ
Image Credit : Getty

ఉడికించిన బీట్‌రూట్: సేఫ్ అండ్ ఈజీ

బీట్‌రూట్‌ను ఉడికించడం వల్ల అందులోని ఫైబర్ మెత్తబడుతుంది. దీనివల్ల ఈజీగా అరుగుతుంది. ఉడికించే ప్రాసెస్‌లో ఆక్సలేట్స్ తగ్గిపోతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయం ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉడికించిన బీట్‌రూట్ తింటే గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు రావు. పైగా ఇది తింటే కొంచెం తియ్యగా, సాఫ్ట్‌గా భలే టేస్టీగా ఉంటుంది. విటమిన్ సి తగ్గినా, బాడీకి అవసరమైన మినరల్స్ మాత్రం బాగా అందుతాయి.

56
బీట్‌రూట్ ఎలా తీసుకుంటే మంచిది?
Image Credit : Getty

బీట్‌రూట్ ఎలా తీసుకుంటే మంచిది?

మీకు ఫుల్ ఎనర్జీ, బీపీ కంట్రోల్ కావాలంటే సలాడ్లు, స్మూతీల్లో పచ్చి బీట్‌రూట్ తురుము వేసుకోండి. కిడ్నీ సమస్యలు ఉన్నా లేదా కడుపులో ఇబ్బందిగా ఉన్నా ఉడికించి కర్రీస్ లేదా రైతాల్లో తీసుకోండి. బీట్‌రూట్ తిన్నప్పుడు యూరిన్ ఎరుపు రంగులో వస్తే భయపడకండి.. ఇది కామన్. అయితే ఒకేసారి ఎక్కువ తినకుండా కొద్దికొద్దిగా అలవాటు చేసుకోండి.

66
బీట్‌రూట్ తో ఈ అదిరిపోయే రెసిపీలు చేసుకోండి
Image Credit : Getty

బీట్‌రూట్ తో ఈ అదిరిపోయే రెసిపీలు చేసుకోండి

బాయిల్డ్ బీట్‌రూట్ సలాడ్: ఒక బీట్‌రూట్‌ను ఉడికించి ముక్కలుగా కోయండి. అందులో వాల్‌నట్స్, కీర దోస, ఉడికించిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు కలపండి. డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, కొంచెం తేనె, వెల్లుల్లి వేసి కలిపేస్తే హెల్తీ సలాడ్ రెడీ అవుతుంది.

రా బీట్‌రూట్ సలాడ్: పచ్చి బీట్‌రూట్ తురుము లేదా ముక్కల్లో దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలు, ఆపిల్ ముక్కలు వేయండి. కొంచెం చాట్ మసాలా, ఉప్పు చల్లి, పైన కొంచెం చీజ్ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Goa Trip: బాలీవుడ్ సినిమాల్లో చూసే ఆ అందమైన లొకేషన్లు గోవాలో ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Recommended image2
Celebrity Restaurants : గోవా వెళ్తున్నారా? విరాట్ కోహ్లీ నుంచి శిల్పా శెట్టి వరకు.. సెలబ్రిటీల టాప్ 6 రెస్టారెంట్లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved