MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?

Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?

 Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఎండాకాలంలో పెరుగు కచ్చితంగా తినాలి. మరి.. మధ్యాహ్నం కాకుండా పరగడుపున పెరుగు అన్నం తింటే ఏమౌతుంది? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 21 2026, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Curd Rice
Image Credit : our own

Curd Rice

ఎన్ని రకాల వంటకాలు ఉన్నా చివరలో పెరుగు లేకపోతే చాలా మందికి భోజనం పూర్తి కాదు దాదాపు అందరూ మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటూ ఉంటారు. లేదంటే రాత్రిపూట తింటారు. ఈ ఎండాకాలం లో పెరుగు మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మజ్జిగ, లస్సీ, రైతా రూపంలో తీసుకుంటారు. అయితే.. మీరు పెరుగును ఎప్పుడైనా పరగడుపున తీసుకున్నారా? ఉదయాన్నే పరగడుపున పెరుగన్నం తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఖాళీ కడుపుతో పెరుగన్నం తినడం...
Image Credit : Instagram

ఖాళీ కడుపుతో పెరుగన్నం తినడం...

పెరుగు శరీరానికి చాలా మేలు చేస్తుంది. కానీ, దానిని సరైన సమయంలో తినాలి. పరగడుపున పెరుగు అన్నం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అంతేకాదు... ఉదయాన్నే పెరుగన్నం తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. శరీరంలో కాల్షియం, ప్రోటీన్ లోపాన్ని అధిగమించడంలో ఇది సహాయపడుతుంది. హై బీపీ ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో పెరుగన్నం కచ్చితంగా చేర్చుకోవాలి. దీనిలో ఉండే మెగ్నీషియం బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను బలపరచడంలోనూ సహాయపడతాయి. కడుపు, శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడతాయి.

Related Articles

Related image1
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Related image2
Rolling Pin: చపాతీ కర్ర నల్లగా మారిందా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మారుతుంది..!
33
వీళ్లు మాత్రం తినకూడదు..
Image Credit : Gemini AI

వీళ్లు మాత్రం తినకూడదు..

ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కూడా కొందరు మాత్రం ఉదయాన్నే పెరుగు అన్నం తినడం మంచిది కాదు. అందరికీ సెట్ అవ్వదు. ముఖ్యంగా జలుబు, సైనస్, ఎసిడిటీతో బాధపడేవారు మితంగా తీసుకోవాలి.

పెరుగన్నం ఎలా తినాలి..?

ఉదయాన్నే పరగడుపున పెరుగును మితంగా తినడంలో ఎలాంటి హాని లేదు. పెరుగులో ఎక్కువగా చక్కెర కలపడం అనారోగ్యానికి దారితీస్తుంది. సాదా పెరుగు తినడం ఇష్టం లేనివారు, అందులో పండ్లు కలుపుకుని తినాలి. మరీ పుల్లగా ఉన్న పెరుగును తినవద్దు. నిల్వ ఉన్న, పుల్లటి పెరుగు కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతి ఒక్కరూ తాజా పెరుగు తినాలి.

పెరుగులోని పోషకాలు

పెరుగులో విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం , ఫోలిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ మూలకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో మన పేగుల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image2
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Recommended image3
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Related Stories
Recommended image1
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Recommended image2
Rolling Pin: చపాతీ కర్ర నల్లగా మారిందా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మారుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved