MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Celebrity Restaurants : గోవా వెళ్తున్నారా? విరాట్ కోహ్లీ నుంచి శిల్పా శెట్టి వరకు.. సెలబ్రిటీల టాప్ 6 రెస్టారెంట్లు ఇవే!

Celebrity Restaurants : గోవా వెళ్తున్నారా? విరాట్ కోహ్లీ నుంచి శిల్పా శెట్టి వరకు.. సెలబ్రిటీల టాప్ 6 రెస్టారెంట్లు ఇవే!

Celebrity Restaurants : గోవా ఫుడ్ కల్చర్ కొత్తగా మారుతోంది. చాలామంది సెలబ్రిటీలు అక్కడ రెస్టారెంట్లు పెట్టారు. కోహ్లీ 'వన్8 కమ్యూన్' నుంచి శిల్పాశెట్టి 'బాస్టియన్' వరకు, గోవాలోని టాప్ సెలబ్రిటీ రెస్టారెంట్ల స్పెషాలిటీస్, లొకేషన్ల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2026, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గోవా వెళ్తే ఈ సెలబ్రిటీ అడ్డాలో ఫుడ్ తినాల్సిందే.. ఆ 6 లొకేషన్లు ఇవే!
Image Credit : Gemini

గోవా వెళ్తే ఈ సెలబ్రిటీ అడ్డాలో ఫుడ్ తినాల్సిందే.. ఆ 6 లొకేషన్లు ఇవే!

గోవా అంటేనే ఒక మ్యాజిక్. అక్కడ సూర్యుడు, సముద్రం ఇచ్చే వైబ్స్ వేరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులతో పాటు మన సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ కూడా గోవా అంటే పడిచచ్చిపోతారు. కేవలం ఎంజాయ్ చేయడమే కాదు, ఇప్పుడు మన స్టార్స్ అక్కడ అదిరిపోయే రెస్టారెంట్లు, బార్లను కూడా నడుపుతున్నారు. మీరు గోవా వెళ్లినప్పుడు లగ్జరీగా తింటూ, మంచి ఫోటోలు దిగాలనుకుంటే.. ఈ ఆరు సెలబ్రిటీ రెస్టారెంట్లు మీ లిస్టులో ఉండాల్సిందే!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్' - అసగావ్, నార్త్ గోవా
Image Credit : ANI

1. విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్' - అసగావ్, నార్త్ గోవా

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ కోహ్లీ గురించి తెలియని వారు ఉండరు. క్రికెట్ మైదానంలోనే కాదు, బిజినెస్ వరల్డ్ లోనూ కోహ్లీ సిక్సర్లు కొడుతున్నాడు. గోవాలోని అసగావ్‌లో ఉన్న 'వన్8 కమ్యూన్' ఇప్పుడు హాట్ ఫేవరెట్. ఈ పబ్ లో నది ఒడ్డున కూర్చుని తింటుంటే ఆ కిక్కే వేరు. ఇక్కడి మెడిటరేనియన్ స్టైల్ డెకర్ చాలా కూల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ 'మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్స్', 'గువా పికాంటే' డ్రింక్ చాలా ఫేమస్. మీరు కోహ్లీ ఫ్యాన్ అయితే ఇక్కడికి వెళ్లాల్సిందే!

37
2. శిల్పా శెట్టి 'బాస్టియన్ రివేరా' - మోర్జిమ్, నార్త్ గోవా
Image Credit : shilpa shetty instagram

2. శిల్పా శెట్టి 'బాస్టియన్ రివేరా' - మోర్జిమ్, నార్త్ గోవా

నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కలిసి నడుపుతున్న 'బాస్టియన్' బ్రాండ్ గురించి అందరికీ తెలిసిందే. గోవాలోని మోర్జిమ్ బ్యాక్ వాటర్స్ లో ఉన్న 'బాస్టియన్ రివేరా' ఒక లగ్జరీ బీచ్ క్లబ్. దీని లుక్ అంతా దుబాయ్, మైకోనోస్ స్టైల్ లో ఉంటుంది. సీఫుడ్ ప్రియులకు ఇది ఒక స్వర్గం లాంటిది. సాయంత్రం వేళ ఇక్కడ సన్ సెట్ చూస్తూ కాక్ టెయిల్స్ తాగడం ఒక రేంజ్ లో ఉంటుంది. హెల్త్ కాన్షస్ గా ఉండేవారికి కూడా ఇక్కడ మంచి ఆప్షన్స్ ఉన్నాయి.

47
3. భూమి పెడ్నేకర్ 'కాయ' - మోర్జిమ్, నార్త్ గోవా
Image Credit : Asianet News

3. భూమి పెడ్నేకర్ 'కాయ' - మోర్జిమ్, నార్త్ గోవా

బాలీవుడ్ యాక్ట్రెస్ భూమి పెడ్నేకర్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఎన్విరాన్మెంట్ గురించి కూడా పోరాడుతుంటుంది. ఆమె గోవాలోని 'కాయ' రిసార్ట్ లో పెట్టుబడులు పెట్టింది. ఇక్కడ మెయిన్ థీమ్ 'స్లో లివింగ్'. అంటే ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా గడపడం అన్నమాట. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండిన వంటలు, బొటానికల్ డ్రింక్స్ స్పెషల్. వెజిటేరియన్స్ కి, నాన్ వెజిటేరియన్స్ కి ఇద్దరికీ ఇక్కడ అదిరిపోయే రుచులు దొరుకుతాయి.

57
4. అమృతా అరోరా 'జోలిన్ బై ది సీ' - అంజునా, నార్త్ గోవా
Image Credit : Instagram

4. అమృతా అరోరా 'జోలిన్ బై ది సీ' - అంజునా, నార్త్ గోవా

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అమృతా అరోరా తన భర్త షకీల్ లడక్ తో కలిసి 'జోలిన్ బై ది సీ'ని నడుపుతోంది. అంజునాలో ఉన్న ఈ రెస్టారెంట్ చాలా స్టైలిష్ గా, బొహీమియన్ స్టైల్ లో ఉంటుంది. ఇక్కడ పిజ్జాలు, పాస్తా తో పాటు ఫ్రెష్ సీఫుడ్ అదిరిపోతుంది. సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవ్వడానికి, ట్రోపికల్ డ్రింక్స్ ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్.

67
5. సారా టాడ్ 'ది శాంక్చురీ బార్ & కిచెన్' - వాగేటర్
Image Credit : Getty

5. సారా టాడ్ 'ది శాంక్చురీ బార్ & కిచెన్' - వాగేటర్

ఆస్ట్రేలియన్ సెలబ్రిటీ షెఫ్ సారా టాడ్ గురించి ఫుడ్ లవర్స్ కి బాగా తెలుసు. వాగేటర్ లోని 250 ఏళ్ల పాతబడిన కట్టడాల మధ్య, పచ్చని చెట్ల నీడలో ఈ రెస్టారెంట్ ఉంటుంది. అసలైన గోవా రుచులకు సారా టాడ్ తనదైన స్టైల్ జోడించి వడ్డిస్తారు. ప్రశాంతంగా, విలాసవంతంగా భోజనం చేయాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ లొకేషన్.

77
6. శ్వేతా సాల్వే 'బర్గర్ ఫ్యాక్టరీ' - అంజునా, నార్త్ గోవా
Image Credit : Getty

6. శ్వేతా సాల్వే 'బర్గర్ ఫ్యాక్టరీ' - అంజునా, నార్త్ గోవా

టీవీ, థియేటర్ ఆర్టిస్ట్ శ్వేతా సాల్వే ఇప్పుడు ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్. అంజునాలో ఉన్న 'బర్గర్ ఫ్యాక్టరీ' గోవాలో చాలా ఫేమస్. ఇక్కడి గౌర్మెట్ బర్గర్స్ కోసం జనం క్యూ కడతారు. పక్కా లోకల్ వైబ్ ఇచ్చే ఈ రెస్టారెంట్ లో మిల్క్ షేక్స్, సంగ్రియాస్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు బర్గర్ లవర్ అయితే అస్సలు మిస్ కావద్దు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆహారం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image2
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image3
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Related Stories
Recommended image1
Top 5 Places in Goa : గోవా వెళ్తున్నారా? ఈ 5 ప్లేసెస్ చూడకపోతే మీ ట్రిప్ వేస్టే!
Recommended image2
Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved