MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Almonds: ఉద‌యం టిఫిన్ చేయ‌డానికి స‌మ‌యం ఉండ‌డం లేదా.? ఇవి తింటే చాలు

Almonds: ఉద‌యం టిఫిన్ చేయ‌డానికి స‌మ‌యం ఉండ‌డం లేదా.? ఇవి తింటే చాలు

Almonds: రోజును సమతుల్యమైన అల్పాహారంతో ప్రారంభించడం శక్తిని అందించడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ బిజీ లైఫ్ కారణంగా చాలా మంది టిఫిన్ స్కిప్ చేస్తున్నారు. అయితే టిఫిన్‌కు బ‌దులు బాదం తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చని తెలుసా.?

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 31 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాదం మంచి ఎంపిక
Image Credit : Asianet News

బాదం మంచి ఎంపిక

అల్పాహారాన్ని మరింత పోషకవంతంగా మార్చుకోవడానికి కాలిఫోర్నియా బాదం మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, మెగ్నీషియం, విటమిన్-ఇతో పాటు మొత్తం 24 రకాల పోషకాలు ఉంటాయి. అలాగే పాలీఫెనాల్స్ జీర్ణకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్-ఇ, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు నియంత్రణకు కూడా దోహదపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిపుణులు చెప్పేదేంటి?
Image Credit : Getty

నిపుణులు చెప్పేదేంటి?

మ్యాక్స్ హెల్త్‌కేర్ డయటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ.. రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అల్పాహారమేనని చెప్పారు. ఇది శరీరానికి అవసరమైన పోషకాల పునాదిని వేస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటే క్లిష్టమైన మార్పులు అవసరం లేదని, పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని అల్పాహారంలో చేర్చుకోవడం సరిపోతుందని సూచించారు. న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం అంటే కఠినమైన డైట్‌లను అనుసరించడం కాదన్నారు. ప్రతిరోజూ పాటించగలిగే చిన్న చిన్న అలవాట్లే శాశ్వత ఆరోగ్యానికి పునాది అవుతాయని వివరించారు.

Related Articles

Related image1
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Related image2
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
34
సోహా అలీ ఖాన్ దినచర్యలో బాదం ప్రత్యేక స్థానం
Image Credit : Asianet News

సోహా అలీ ఖాన్ దినచర్యలో బాదం ప్రత్యేక స్థానం

నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ.. తన ప్రతి ఉదయం ఒకేలా ఉండదని, కానీ ఆరోగ్యకరమైన ఆహారంతో రోజును ప్రారంభించడం మాత్రం ఎప్పుడూ మాననని చెప్పారు. కాలిఫోర్నియా బాదం తన అల్పాహారంలో క్రమం తప్పని భాగమైందని తెలిపారు. ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా వీటిని సులభంగా తీసుకెళ్లవచ్చని, చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఎంపికలే దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

44
కాలిఫోర్నియా బాదం వెనుక ఉన్న సంస్థ
Image Credit : our own

కాలిఫోర్నియా బాదం వెనుక ఉన్న సంస్థ

కాలిఫోర్నియా బాదంపప్పులు సహజమైన, నాణ్యమైన ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కాలిఫోర్నియాలోని 7,600 మందికి పైగా బాదం రైతులు, ప్రాసెసర్ల తరఫున ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధన ఆధారిత విధానాలతో బాదం వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. 1950లో స్థాపించిన‌ ఈ లాభాపేక్షలేని సంస్థ అమెరికా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో పనిచేస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Recommended image2
Baking Soda Vs Baking Powder: బేకింగ్ పౌడర్, బేగింగ్ సోడాకు తేడా ఏంటి? ఏది దేనికి వాడాలి?
Recommended image3
Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు
Related Stories
Recommended image1
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Recommended image2
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved